ఎంతో సంతోషంగా పాపి కొండలు చూసేందుకు వెళ్లారు. బోట్  ఎక్కి పాపి కొండలు చూసేందుకు సిద్ధం అయ్యారు. కానీ వాళ్ళ  సంతోషాన్ని చూసి  విధి ఓర్వలేక పోయింది. వాళ్ళు ప్రయాణిస్తున్న బోట్ ను నదిలో  ముంచేసింది. పాపి కొండలు చూసేందుకు బయల్దేరిన వాళ్ళ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 12 మంది మృత దేహాలు వెళిక్కి తీయగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 

 

తూర్పు గోదావరి జిల్లా కుచ్చలూరు  వద్ద జరిగిన బోట్ ప్రమాదం జరిగింది. బోట్లో 65 మంది ప్రయాణికులు ఉండగా ఇప్పటికే 12 మంది మృత దేహాలు వెలిక్కి తీశారు అధికారులు.కాగా 27 మంది ప్రమాదం నుండి బయట పడ్డారని వెల్లడించారు అధికారులు. ఈ ఘటనపై వశిష్ఠ బోట్ యజమాని  కోడిగుడ్ల వెంకటరమణ స్పందించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం తో పాపి కొండలు టూర్ కి బోట్ లను పోలీసులు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ... బోట్ డ్రైవర్స్ వినకుండా అలాగే వెళ్లారని ఆయన తెలిపారు. కాగా సుడిగుండం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బోట్ యజమాని తెలిపారు. పెద్ద సుడిగుండం రావటం వల్లే డ్రైవర్ బోట్ ని కంట్రోల్ చేయలేక  ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే బోట్ కెపాసిటీ 90 మంది కాగా... 150 లైఫ్ జాకెట్లు ఉన్నాయని వశిష్ఠ బోట్ యజమాని కోడిగుడ్ల వెంకటరమణ తెలిపారు. అయితే బోట్ ప్రమాద మృతులకు పలువురు సంతాపం తెలియ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: