తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు వద్ద నిన్న జరిగిన బోట్ ప్రమాదంలో  తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి .గోదారమ్మ అందాలను చూస్తూ ...పాపికొండల సొగబులు  వీక్షిస్తూ   ఎన్నో మధుర జ్ఞాపకాలను కూడగట్టుకుందామని  పాపికొండల టూర్ కి బయల్దేరారు ప్రయాణికులు . గోదారి అందాలను ... పాపికొండల వయ్యారాలు చూస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు  .కానీ వాళ్ళ ఆనందాన్ని చూసి ఓర్వలేక విధి కన్నుకుట్టుంది . బోట్ ప్రమాదంలో రూపంలో ప్రయాణికులను మృత్యువు కబళించింది .


ఈ ఘోర బోట్ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పదుల సంఖ్యకు చేరగా ...25 మంది  ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయట పడ్డారు. అయితే గల్లంతయిన వారి కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు .కాగా  ఈ బోట్ ప్రమాదం పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రమాదంలో బాధితుల కోసం ముమ్మర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు .ప్రమాదంలో మృతి చెందిన వారికి పది లక్షల ఎక్స్ గ్రేషియా  ప్రకటించారు . 


అయితే ఘోర బోట్ ప్రమాదం నుండి ప్రమాదంలో బయట పడిన వరంగల్ వాసి ప్రభాకర్ బోట్ ప్రమాదంలో ఎక్కువ ప్రాణనష్టం జరగటానికి గల  కారణాన్ని వెల్లడించారు . ప్రమాదం ముందు వరకు చాలా మంది ప్రయాణికులు లైఫ్ జాకెట్లు  ధరించారని ...అయితే ఉక్కపోత కారణంగా లైఫ్ జాకెట్లు తీసేశారని తెలిపాడు ప్రభాకర్ . అయితే ప్రయాణికులు లైఫ్ జాకెట్లు తీసేసిన కొద్దీ సమయానికే ప్రమాదం సంభవించిందని ...దీంతో బోట్ మునిగిపోవటం తో చాల మంది గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారని తెలిపాడు ప్రభాకర్ .ఒకవేళ ప్రయాణికులు లైఫ్ జాకెట్లు తీయకుండా ఉండే ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేదని తెలిపాడు ప్రమాదం నుండి  బయట పడిన వరంగల్ వాసి ప్రభాకర్.


మరింత సమాచారం తెలుసుకోండి: