మా ఫేస్ క్రీమ్ వాడితే మీ ముఖం మెరిసిపోతుంది ...మా ఫేస్ క్రీమ్ వాడితే మీరు చాలా యంగ్ గా కనిపిస్తారు .ఇలా రోజు టీవీ ల్లో మనం అడ్వటైస్మెంట్లు చూస్తూనే ఉంటాం . ఇలాంటి వాటికి ఆడవాళ్లు బాగా ఎట్రాక్ట్ అవుతారు .ఎందుకంటే అందరి కంటే అందంగా కనిపించాలనే తపన అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి . అయితే కొంత మంది కొన్ని విచిత్రమైన క్రీమ్స్ వాడి ...ఉన్న అందాన్ని పోగుట్టుకున్న వాళ్ళు ...కొన్ని వెరైటీ క్రీమ్స్ ద్వారా హెల్త్ పాడు చేసుకున్నవారు ఉన్నారు .ఇలాంటి ఘటనే ఇక్కడ జరిగింది . ఓ  47  ఏళ్ళ మహిళా తన  ఏజ్ కనిపించకుండా యంగ్ గా కనిపించేందుకు ఓ క్రీమ్  వాడి  కోమాలోకి వెళ్ళింది .


వివరాల్లోకి వెళ్తే ...అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళా వయస్సు ఎక్కువగా కనిపించకుండా ఉండటానికి పేస్ క్రీములు వాడి చిక్కుల్లో పడింది .అయితే తన వయస్సుని కవర్  చేసి యంగ్ గా కనిపించేందుకు ఆంటీ ఏజింగ్ క్రీమ్  వాడింది ఓ మహిళా . ఈ క్రీమ్ ని ప్రత్యేకంగా మెక్సికో నుండి తెప్పించింది.అయితే  ఈ క్రీమ్ వాడగానే అస్వస్థతకి గురైన మహిళను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు .చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్ళింది ఆ మహిళా .ఈ విషయాన్నీ సాక్రమెంటో కంట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది . దీనిపై కేసు కూడా నమోదయ్యింది .


అయితే ఆ మహిళా వాడిన క్రీమ్ ని పరిశీలించిన వైద్యులు.. ఈ   క్రీమ్ లో మిథైల్ మెర్క్యురీ అనే రసాయనం ఉందని ..ఈ రసాయనం  కొన్ని అరుదైన సందర్భాల్లో  విషప్రభావాన్ని చూపుతుందని వివరించారు . కాగా అస్వస్థతకి గురైన మహిళా కల్తీ క్రీమ్ వాడటం వల్లే కోమాలోకి వెళ్లి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: