ఏ పేపర్లు లేకుండా  వాహనం నడుపుతున్నప్పుడు  ఖర్మకాలి పోలీసులకి  దొరికితే వాళ్ల పని అంతే . ఎంత ఇబ్బంది పెడతారో అందరికి తెలిసిన విషయమే . పోలీసులు వాహన దారులను ఇబ్బంది పెట్టడమే కాదు .కొంత మంది వాహనదారులు  పోలీసులకి చుక్కలు చూపించే వాళ్ళు ఉంటారు .ఇలాంటి వాళ్లలో ఎక్కువగా కనిపించేది మందుబాబు లే. 


ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన డ్రంక్  అండ్ డ్రైవ్ తనికీలు చేస్తూ కనిపిస్తున్నారు  పోలీసులు . తాగి పోలీసులకి దొరికితే పరువు పోతుందని కొందరు తాగకుండా ఉంటె ... ఇంకొందరు మాత్రం పోలీసులు ఉంటె మాకేంటి అంటూ ఫుల్లుగా మందు కొట్టి వాహనం నడుపుతున్నటారు . అయితే ఈ ఫుల్లుగా మందు కొట్టిన వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు  చేస్తూ పోలీస్ సార్లు ఎదురైతే ... మంచి కిక్కులో ఉన్న  మందుబాబులు  పోలీసులకి చుక్కలు చూపించక మానరు .ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చూసాం కూడా .ఇలాంటి ఘటనే ఇప్పుడు మరోటి జరిగింది . ఫుల్లుగా మందుకొట్టిన ఓ వ్యక్తి కి పోలీసులు చలాన్ విధించటం తో వీరంగం  సృష్టించాడు . తన వాహనం పై పెట్రోల్  పోసి నిప్పనించాడు . . ఈసీఐఎల్ దగ్గర ఈ ఘటన జరిగింది .


సికింద్రాబాద్ నాగారం కి చెందిన కనకయ్య ఫుల్ గా మందు కొట్టి వాహనం పై వస్తుండగా ...ఈసీఐఎల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకి చిక్కాడు . దీంతో బ్రీత్ అనలైజర్ ద్వారా పోలీసులు చెక్ చేయగా 256  పాయింట్లు వచ్చింది .దీంతో ఆ వాహన దారుడికి  చలాన్ విధించారు పోలీస్ లు . కాగా  మద్యం మత్తులో ఉన్న కనకయ్య నాకే చలాన్ విధిస్తారా అంటూ తన బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటిచాడు  . దీంతో షాక్ కి గురైన పోలీసులు మంటల్ని ఆర్పీ  ... తమ విధులకు ఇబ్బంది కలిగించాడని  అదుపులోకి తీసుకున్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి: