వాహన దారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేందుకు  ప్రభుత్వం, పోలీసులు  ఎన్నో చర్యలు తీసుకుంటారు . ట్రాఫిక్ రూల్స్ వాహనదారులు పాటించేలా కొన్ని కొన్ని సార్లు వినూత్న  ప్రయత్నాలు చేస్తుంటారు పోలీసులు . కానీ ప్రభుత్వం,  పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాహనదారులు మాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించండం  చాలా తక్కువ. కొంత మంది పోలీసులు హెల్మెట్ లేని వాహనదారులను ఆపి హెల్మెట్ కొనివ్వడం... కొంతమంది వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోతే అక్కడే తయారు చేయించి ఇవ్వటం   ఇలా పోలీసులు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ఎన్నో వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు... ఎక్కడ చూసినా కనుచూపు మేర వరకు ట్రాఫిక్ జామ్ అయి కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది నిబంధనలు పాటించక పోవడం వల్లే కదా. 

 

 

 అయితే తాజాగా హైదరాబాద్ పోలీసులు ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్ చూస్తే ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఉండలేరు. ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు ఎప్పుడు వినూత్నంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ అందరికీ నచ్చే మెచ్చే విధంగా ఉంది. అయితే ఈ ఆఫర్ ట్రాఫిక్ రూల్స్ పాటించని  వాళ్లకు కాదండోయ్ ... ఓన్లీ ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాళ్ళకి మాత్రమే. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనదారులను ప్రోత్సహిస్తూ వినూత్న  ఆలోచన చేసారు  హైదరాబాద్ పోలీసులు. అన్ని పత్రాలు ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటించిన  వాహనదారులకు సినిమా టికెట్ల పంపిణీ చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న హైదరాబాద్ పోలీసులు ఈ కొత్త  ఆలోచనతో సక్సెస్ సాధిస్తున్నారు. హైదరాబాద్ లో  వాహన తనిఖీ చేస్తున్న పోలీసులు... అన్ని పత్రాలు ఉండి ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా  పాటిస్తే వాళ్లకి సినిమా టికెట్ ను బహుమతిగా అందజేస్తున్నారు. సినిమా టికెట్లు ఫ్రీగా వస్తుండడంతో వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు మక్కువ చూపుతున్నారు. ఏదేమైనా హైదరాబాద్ పోలీసులు ఈ వినూత్న ఆలోచనతో శభాష్ అనిపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: