ప్రాణాలను కాపాడే ఆస్పత్రిలోని యువతి ప్రాణం తీసిన అంత పని అయింది . వైద్యం కోసం వచ్చిన ఓ యువతిపై కాంపౌండర్ కామవాంఛతో  కన్ను వేశాడు . కడుపు నొప్పి తగ్గేందుకు  ఇంజక్షన్ ఇస్తానంటూ మత్తుమందు ఇచ్చి అమ్మాయి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

 

 పేషెంట్లకు వైద్య సేవలు అందించాల్సిన కాంపౌండరే  కామపిశాచిలా మారిన ఘటన యూపీలోని మథుర లో  చోటుచేసుకుంది. తీవ్ర కడుపు నొప్పి రావడంతో యువతి చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళింది.అయితే అక్కడే ఉన్న కాంపౌండర్ వైద్యం కోసం వచ్చిన ఆ యువతి పై కన్ను వేశాడు. ఆ యువతిపై ఎలాగైనా కామ వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు . కాగా  అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ వచ్చే వరకు ఆపరేషన్ థియేటర్లు వెయిట్ చేయమని ఆ యువతికి చెప్పాడు కాంపౌండర్ . అయితే డాక్టర్ ఎంతసేపటికీ రాలేదు.


ఆ  యువతి కడుపునొప్పి తీవ్రతరం అవ్వటంతో...  తన కడుపు నొప్పి ఎక్కువ  అయిందని డాక్టర్ ఇంకెప్పుడు వస్తాడని కాంపౌండ్ అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. అయితే  తన కామవాంఛ తీర్చుకోవడానికి ఇదే  అదునుగా భావించిన కాంపౌండర్... ఇంజక్షన్ ఇస్తానని ఇంజక్షన్ ఇస్తే కడుపునొప్పి తగ్గుతుంది అని యువతిని నమ్మించాడు. అయితే కాంపౌండర్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత యువతి  మెల్లగా స్పృహ కోల్పోయింది .  దీంతో  ఆ కామాంధుడు ఆ యువతిపై లైంగిక దాడి చేశాడు. అయితే మెల్లగా మత్తులోంచి తేరుకున్న యువతీ అక్కడి నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: