మారుతి సుజుకి నుండి వచ్చిన బాలెనో ఆర్.ఎస్ కారు ధర భారీగా తగ్గించడం జరిగింది. ఏ వెహికల్ ధర అయినా సరే 10 నుండి అత్యధికంగా 50 వేల వరకు తగ్గే అవకాశం ఉంది కాని మారుతి బాలెనో మాత్రం లక్ష వరకు తగ్గించారట. ఈ వెహికల్ 7.89 లక్షల ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తుంది.    


కేవలం ఈ తగ్గింపు ధరలు పండుగ సమయాల్లోనే అని తెలుస్తుంది. ఫెస్టివల్ సీజన్ లో మారుతి తమ వెహికల్స్ సేల్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో బాలెనో ధర భారీగా తగ్గించారు. బి.ఎస్ 6 వెహికల్స్ రాబోతున్న కారణంగా బి.ఎస్ 4 నామ్స్ తో వచ్చిన వెహికల్స్ స్టాక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు.


మారుతి సుజుకి నుండి వచ్చి ఈమధ్య కాలంలో సక్సెస్ అయిన వెహికల్ బాలెనో. 1.0 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న ఈ వెహికల్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. 102 బి.హెచ్.పి పవర్, 150 ఎన్.ఎం టార్క్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఈ ఫెస్టివల్ సీజన్ సేల్ కోసం మారుతి సుజుకి వేసిన ఈ ప్లాన్ సేల్స్ మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందో చూడాలి.       



మరింత సమాచారం తెలుసుకోండి: