పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కు బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా వాడేలా ప్రభుత్వం సూచనలను ప్రోత్సహించేలా మోటార్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మోటార్ సంస్థలు ఎలెక్ట్రిక్ వెహికల్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు టాటా నుండి నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేస్తున్నారు. టాటా నుండి ఎస్.యు.వి సెగ్మెంట్ లో వచ్చిన నెక్సాన్ వెహికల్ సూపర్ క్లిక్ అయ్యింది.


ఈ క్రమంలో ఈ సెగ్మెంట్ ను ఎలక్ట్రిక్ అనుసంధానంగా రిలీజ్ చేస్తున్నారు. 2020 లో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. 300 వోల్ట్ కెపాసిటీతో ఈ వెహికల్ వస్తుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 300 కిలోమీటర్స్ వరకు ప్రయాణించగలరట. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో వస్తున్న ఈ వెహికల్ బ్యాటీలకు 8 ఏళ్ల గ్యారెంటీ ఇస్తున్నారు.


నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ లానే నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉండొచ్చని అంటున్నారు. ఇక ఈ వెహికల్ ధర కూడా 15 లక్షల నుండి 17 లక్షల దాకా ప్రైజ్ ఫిక్స్ చేస్తున్నారట. ప్రస్తుతం నెక్సాన్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ 7 నుండి 11 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. మరి త్వరలో మార్కెట్ లో రాబోతున్న టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: