దేశీయ ఆటోమొబైల్  ఇండస్ట్రీ  ప్రస్తుతం  తీవ్ర సంక్షోభం లో కూరుకుపోయింది. వరుసగా  11వ నెల కూడా  వృద్ధి రేటు కనబరచలేదు. సెప్టెంబర్ నెలలో  ప్యాసింజర్ వాహనాల విక్రయాలు  ఏకంగా 23శాతం తగ్గుముఖం పట్టాయి. వాహన కొనుగోలు దారులు కూడా  పెద్దగా  ఆసక్తిని కనబర్చకపోవడంతో  ఆటో మొబైల్ ఇండస్ట్రీ  వృద్ధి రేటు లేక  కుదేలవుతుంది.  గత నెలలో కేవలం 2, 23, 317 వాహనాలు మాత్రమే అమ్ముడు కాగా  గత ఏడాది సెప్టెంబర్ లో   2,92,660 యూనిట్ల  వాహనాల ను  విక్రయించారని సొసైటీ అఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ (సియామ్)  తాజాగా తన నివేదికలో పేర్కొంది.



ఈ సెప్టెంబర్ లో  దేశీయ  కార్ల  విక్రయాలలో  34శాతం  క్షీణత  నమోదయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ లో 1,97,124 కార్ల విక్రయాలు జరుగగా  ఈఏడాది సెప్టెంబర్ లో 1,31,281యూనిట్ల విక్రయాలు మాత్రమే జరుగాయి. ఇక అన్ని కేటగిరీల  వాహనాలు కలుపుకొని  గత నెలలో 20,04,932 వాహనాలను విక్రయించగా  సెప్టెంబర్ 2018లో  25,84,062  వాహనాలను  విక్రయించినట్లు సియామ్ వెళ్ళడించింది.  ఇదిలా ఉంటే  సంక్షోభం నుండి బయటపడేందుకు  ఆటో మొబైల్ సంస్థలు అనేక  ప్రయత్నాలు చేస్తున్న  పెద్దగా ఫలితం కనిపించడం లేదు. పండగ సీజన్ సందర్భంగా  తదితర  వాహనాల పై భారీగా  భారీగా  డిస్కౌంట్ లను ప్రకటిస్తూ  వాహనదారులను  ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కూడా పెద్దగా  వాహన విక్రయాలు జరుగడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: