రసాయ శాస్త్రంలో 2019 ఏడాదికి గాను నోబెల్ బహుమతిని సంయుక్తంగా ముగ్గురు శాస్త్రవేత్తలకు లభించింది అని ప్రకటించారు. లిథియం-అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేసినందుకు జాన్‌ బి.గూడెనఫ్‌, స్టాన్లీ విట్టింగమ్‌, అకిరా యోషినోలను సంయుక్తంగా నోబెల్ కమిటీ బుధవారం ఎంపిక చేసింది. జర్మనీకి చెందిన గూడెనఫ్, బ్రిటన్‌కు చెందిన స్టాన్లీ విట్టింగమ్, జపాన్‌కు చెందిన యోషినోలు లిథియం-అయాన్ బ్యాటరీ అభివృద్ధి చేసినందకు గానూ ఈ ఏడాది నోబెల్ లభించింది. ముగ్గురు శాస్త్రవేత్తలూ ప్రస్తుతం వివిధ యూనివర్సిటీల్లో ప్రయోగాలు చేస్తున్నారు.


 అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో గూడెనఫ్, బింగ్హమ్‌టన్ యూనివర్సిటీలో విట్టింగమ్, జపాన్‌లోని నాగోయలో మెయిజో యూనివర్సిటీలో యోషినీలు ప్రయోగాలు జరిపి, స్మార్ట్‌ఫోన్‌లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేశారు. ప్రైజ్ మనీ ముగ్గురికీ సమానంగా అందచేయడం జరిగింది.


మొదట  భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్యశాస్త్రం, శాంతి ఈ ఐదు విభాగాల్లో నోబెల్ బహుమతి అందజేసేవారు. స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం 1901 నుంచి ఈ బహుమతులను లభించిన వారికీ అందచేస్తునారు. నోబెల్ గౌరవార్దం 1969  సంవత్సరం  నుంచి అర్ధశాస్త్రంలో నోబెల్ అందజేస్తున్నారు.  వివిధ రంగాలలో విశేష కృషి, పరిశోధనల ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, మానవ సమాజానికి ఉపయోగపడిన శాస్త్రవేత్తలకు మాత్రమే  నోబెల్ అందజేస్తారు.


ఇక, భారత్ నుంచి 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా నోబెల్ అందుకున్నారు. సాహిత్యంలో ఆయనను నోబెల్ వరించింది. తర్వాత రసాయన శాస్త్రంలో సర్ సీవీ రామన్ (1930), ఇక వైద్యశాస్త్రంలో హర్‌గోవింద్ ఖురాన్ (1968), మదర్ థెరిసా- శాంతి (1979), భౌతిక శాస్త్రంలో సుబ్రమణ్య చంద్రశేఖర్ (1983), అర్ధశాస్త్రంలో అమర్త్యసేన్ (1998), కైలాష్ సత్యార్థి- శాంతి (2014) ఇక అనేక రంగాలలో నోబెల్ బహుమతి అందుకున్నారు. వీరితోపాటు వీఎస్ నైపాల్, వెంకట్రామన్ రామకృష్ణన్‌ తదితర భారతీయ సంతతి పౌరులు కూడా నోబెల్ బహుమతి తీసుకున్నా వారిలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: