స్త్రీలు తమ సౌందర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసకుంటారు. అంతే కాదు కవులు కూడా స్త్రీ ఆందాన్ని పొగుడుతూ కవితలు రాస్తుంటారు.  నిత్య యవ్వనంగా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది..ముఖ్యంగా స్త్రీలు తమ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు.చర్మ సౌందర్యానికి మనం అష్టకష్టాలు పడుతుంటాం. ఆ క్రీమనీ, ఆ బ్యూటీ పార్లర్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి చర్మ సౌందర్యం ఇనుమడింపచేసుకునేలా ప్రయత్నిస్తాం.

కానీ ఫలితాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. అయితే మన చేతిలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడే సహజసిధ్ధ క్రీములున్నాయి. వాటిని వాడితే మీ చర్మం మునుపటికంటే ఎంతో నాచురల్ గా సౌందర్యవంతంగా తయారవుతుంది. అయితే మన ఇంట్లోనే చక్కటి ఔషదాతో చర్మసౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. 


సౌందర్యం కోసం ఇంట్లో పాటించాల్సిన చిట్కాలు:



శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన 6. చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.


మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.


నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.


బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది. 


 నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.


 బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.


నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: