సాధారణంగా వర్షకాలం, చలికాలం అంటేనే ఎన్నో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. వర్షాకాలం కాస్త తేమగా ఉండి మృధువైన చర్మంపై రాషెస్ వస్తుంటాయి, ఇక చలికాలం మాత్రం చర్మం పొడిబారడం, మొద్దు బారడం కనిపిస్తుంది. కొన్ని చోట్ల తెల్లగా పాలిపోయి అందవిహీనంగా ఉంటుంది. ఇవేగాక ఈ కాలంలో ప్రధానంగా వేధించే మరో సమస్య పాదాలు పగలడం. ఇది మరింత బాధను కలిగిస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ బాధ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది.


కొద్ది మందికి పాదాలు పగిలి ఇబ్బంది పెడుతుంటాయి. వీటి నివారణకు కోసం అనేక రకాలైన ప్రయోగాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే అన్ని రకాల క్రీములను వాడుతుంటారు. అయిన ప్రయోజనం అంతంత మాత్రమే కానీ ఈ బాధనుండి బయటపడడానికి, పాదాల పగుళ్లను మీ ఇంటిలోనే నివారించుకునే ఛాన్స్ ఉంది. పాదాల పగుళ్లను నివారించడానికి వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల ఉప్పు, చెంచా చొప్పున నిమ్మరసం, గ్లిజరిన్, కాస్త రోజ్ వాటర్ కలపాలి. అందులో పావుగంట పాటు పాదాలను ఉంచి ఫ్యుమిస్ రాయితో రుద్దాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.


ఇదే కాకుండా తేనెలో తేమనందించే యాంటి బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి పాదాల పగుళ్లను పోగొట్టి మృదువుగా మారుస్తాయి. పావు బకెట్ నీళ్లలో నాలుగు చెంచాల తేనె కలిపి పాదాలను పావుగంగ పాటు నానబెట్టాలి. తర్వాత పాదాలను గట్టిగా రాస్తూ కడిగితే పగుళ్లు పోతాయి.


పాదాల పగుళ్ల నివారణకు బియ్యం పిండి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం మూడు చెంచాల బియ్యం పిండి, రెండు చెంచాల తేనె, చెంచా ఆపిల్ సిడర్ వెనిగర్ కలపాలి. గోరువెచ్చని నీళ్లలో పది నిమిషాల పాటు పాదాలను ఉంచి ఈ మిశ్రమంతో స్రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


చెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించినా ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెని పాదాలకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కాళ్ల పగుళ్లు మాయమైపోయి మీ పాదాలు అందంగా మారుతాయి. ట్రై చేసి చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: