వసంత ఋతువు తరలివచ్చింది... ఎటు చూసిన పూలసోయగాలు కనువిందు చేస్తాయి. పుష్పాలంకరణ ప్రియులకు వసంతం నిజంగా... ఓవరం అయితే, ఎంత అందమైన పుష్పాలంకరణ చేసినప్పటికీ... కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఫలితం ఉండదు. త్వరగా పూవులు పాడైపోతాయి. అందుకే ఈ చిన్నిచిట్కాలు పాటించండి. - ముందుగా మీరు అలంకరణ కోసం ఉపయోగించే పాత్ర ప్లవర్ వేజ్ లాంటివి నూటికి నూరుపాళ్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. -మొద్దు కత్తెరల వల్ల పూవులు, ఆకులను తీరుగా కత్తిరించలేం. అందుకే వాటికి సానపెట్టించి ఎప్పుడూ బాగా పదునుగా ఉండేలా చూడండి. -పాత్రలో నీరు పోసిన తర్వాత అడుగున ఆకులు... రెమ్మల్లాంటివి మిగిలిపోయి ఉంటే తొలగించండి. - పాత్రలో నీరు పోసిన తర్వాత అడుగున ఆకులు... రెమ్మల్లాంటివి మిగిలిపోయి ఉంటే తొలగించండి. - బాగా బరువైన పుష్పాలను చక్కగా అమరినట్లుగా ఉంచాలంటే సన్నటి వైరుతో వాటికి సపోర్టు ఇవ్వాలి. - పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత పోసే నీరు మరీ చల్లగానో... వేడిగానో ఉండకూడదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: