తీవ్రంగా అలసటకు లోనైనప్పుడు, చెమటలు కారుతుంటే స్నానం చేయాలనిపిస్తుంది. అంతేకాదు. ఆ తరువాత కొత్త శక్తి, ఉత్సాహం పుంజుకొన్న అనుభూతి కలుగుతుంది. స్నానం ఆరోగ్యానికే కాదు. సౌందర్యానికీ ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. పూర్వకాలంలో రాణులు పాలతో, రకరకాల పూలు, మూలికలు కలిపిన నీటితో స్నానం చేసే అందాన్ని కాపాడుకొనేవారు. అన్నీ పరుగులపైనే నడిచే ఇప్పటియాత్రిక యుగంలో ఒకింత సేదతీరేది స్నానంలోనే కాబట్టి, ఆ కాస్త టైమును సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకేం పెద్దగా కష్టపడక్కర్లేదు. మనకు సులభంగా దొరికే పధార్థాలతోనే సత్ఫలితాలు సాధించవచ్చు. అదెలాగో చూద్దాం.! వేప : వేప మనకు ప్రతిచోటా దొరికిదే, వేపాకులు లేదా వేపాకు పొడినీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మ సంబంధిత రుగ్మతలను తగ్గించడమే కాదు. యాంటీ సెప్టిక్ గానూ పనిచేస్తుంది. కమలాతొక్కలతో : కమలా ఫలాల తొక్కలు ఎండబెట్టి పొడిచేసి ఉంచుకొంటే ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఈ పొడిని ఓట్ మీల్ లేదా శనగపిండితో కలిపి పేస్టులా చేసి శరీరానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక రుద్ది సున్నిపిండిలా నలచాలి. ఫలితంగా మచ్చలు మొటిమలు వంటివి తగ్గి చర్మం మృదువుగా, కాంతిగా ఉంటుంది. బొప్పాయి ఆకులు : ఈ ఆకులు పొడిచేసి ఓట్ మీల్ లేదా మసూర్ దాల్ పొడిలో సమపాళ్లలో కలిపి ఫేస్టులా చేయాలి. శరీరానికి ఈ పేస్టు రాసుకొని 10 నిమిషాలయ్యాక స్నానం చేస్తే చక్కటి మెరుపే వస్తుంది. తులసి : ప్రతి ఇంటా పూజించే తులసి ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుంది. దీన్ని ఓట్ మీల్, సరివాలతో ఒక స్పూను చొప్పున కలిపి శరీరానికి రాసుకుంటే మొటిమలు, పొక్కులు, ఎలర్జీలు తగ్గుతాయి. గంధం : అరగదీసి శనగపిండితో లేదా ఓట్ మీల్ తో కలిపి రాసుకొంటే చర్మం కాంతి మెరుగవడమే కాక శరీరాన్ని చల్లబరుస్తుంది. యంజీష్ట : మంజీష్ట పౌడరును ఓట్ మీల్ లేదా శనగపిండితో కలిపి పేస్టులా చేసి శరీరానికి రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత నలుగులా వలిచేసి స్నానం చేయాలి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా, కాంతిగా ఉంటుంది. సరివ: సరివ మూలికలను పొడిచేసి ఓట్ మీల్ తో పాలు లేదా నీళ్ళతో కలిపి పేస్టులా చేసి శరీరమంతా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత రుద్ది స్నానం చేయాలి. దీనివల్ల చర్మం మెరుస్తూ, మృదువుగా తయారవుతుంది. ఖుస్ : గసగసాల మొక్కలు వేళ్ళు శరీరాన్ని చల్లబరచడంలో అమోఘంగా పనిచేస్తాయి. ముఖ్యంగా శరీరం, కాళ్ళు చేతులు వేడిగా వుండావారు, చెమట ఎక్కువై బాధపడేవారు ఇవి వాడచ్చు. అందుకు ఈ ఖుష్ వేళ్ళను లేదా పొడిని నీళ్ళలో స్నానానికి గంటముందు నానెయ్చాలి. ఆ నీటిని స్నానం చేయడానికి వాడాలి. ఫలితంగా శరీరం చక్కబడటమే కాక చక్కటి సువాసన మనసును ఆహ్లాదపరిచే రోజంతా తాజాగా ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: