కర్పూరం ఈ పదం ఇప్పటికాలంలో చాలామందికి తెలిసి ఉండక పోవచ్చు కానీ మనం నిత్యం దేవుడిని కొలిచే ముందు మాత్రం ఈ పదార్ధాన్ని ఉపయోగిస్తాం..అయితే యీ కర్పూరం హిందూమతానికి కానీ హిందువులు మాత్రమే  వాడేది అని అనుకుంటారు చాలా మంది ఇప్పటికి కూడా కానీ ఇది ఒక మొక్క నుంచీ వచ్చే ఔషధం ద్వారా తయారు చేస్తారు అనే విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి దీనిలోని ఆయుర్వేద, వృక్ష సంబంధిత ఔషధ గుణాలు సమర్థవంతమైన మరియు సహజ చికిత్సా విధానాలలో ఉపయోగపడతాయి.

 Image result for camphor

చర్మ సంరక్షణకి ఎంతో చక్కగా ఉపయోగపడే ఒక గొప్ప ఔషధం ఈ కర్పూరం ఆయుర్వేద  చికిత్సలలో కర్పూరంను ఎక్కువగా వాడతారు...కీళ్ల నొప్పులు మొదలు చుండ్రు తగ్గటానికి కర్పూరం ఎంతో బాగా పని చేస్తుంది..ఇది మొటిమలని నయం చేయడంలో ఎంతో అద్భుతంగా పని చేస్తుంది..అంతేకాదు ఇది సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు..అయితే కర్పూరం ద్వారా చర్మాన్ని ఎలా సంరక్షించు కొవచ్చో ఇప్పుడు చూద్దాం..

 Image result for camphor uses for skin

పుదీనా వేప ,లాగా కర్పూరానికి కూడా చల్లదనం ఇచ్చే గుణం ఉంటుంది వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు మోటిమలు మరియు చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. కనుక, కర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా మోటిమలను నివారించుకోవచ్చు...కర్పూరంను రోజు ముఖానికి రుద్దుకుంటే, ఇది మోటిమలతో పాటుగా వాటి వలన కలిగే నొప్పి మరియు వాపును కూడా తగ్గిస్తుంది.

 Image result for camphor uses for skin

అయితే దీనిని ఎలా ఉపయోగించాలి అంటే మొటిమల నివారణకు కర్పూరంను తైల రూపంలో ఉపయోగించాలి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున, చర్మానికి కలిగే నష్టాల నుండి నిరోధిస్తుంది. .శరీరంపై వచ్చే మొటిమలు నయం చేయడం కోసం “ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూర తైలాన్ని కలిపి గాలి చొరబడని సీసాలో నింపాలి. పడుకునే ముందు,ఈ మిశ్రమంను ఒక టీ స్పూనుడు తీసుకుని ప్రభావిత ప్రాంతంలోని రుద్దండి. రాత్రిపూట అది వదిలివేసి, మరుసటి రోజు ఉదయం ముఖం కడుక్కోవాలి.అ..ఇలా కనీసం మూడు రోజులు చేసి చూడండి తప్పకుండా ఫలితం దక్కుతుంది.

 Image result for camphor uses for skin


నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి కరిగించి..దాన్ని మచ్చలు ఎక్కువగా ఉన్న చోట రాసుకోండి ఇక కొన్ని రోజుల్లోనే ఆ మచ్చలు కనిపించవు...ఈ పద్ధతిని అనుసరిస్తే, దురదలు త్వరగా తగ్గిపోతాయి.ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ అంటువ్యాధుల వల్ల కలిగే దురదలకి కర్పూరంతో చేసే ఈ చిట్కా ఎంతో ఉపసమనం ఇస్తుంది.. ఇలా కర్పూరాన్ని ఎలాంటి చర్మ వ్యాధులు వచ్చినాసరే నీటిలో కానీ కొబ్బరి నూనెలో కాని రంగరించి రాసుకుంటే ఉపసమనం దొరకడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: