సహజంగా మన చర్మం వాతావరణ పరిస్థితుల బట్టి కానీ లేదంటే తినే తిండిలో సరైన పోషక విలువలు లేకపోవడం వలన కానీ రంగు మారుతూ ఉంటుంది. అంతేకాదు ముఖంపై మలినాలు పేరుకుని పోవడం వలన కూడా నల్లగ మారటం, ముఖంపై మొటిమలు, మచ్చలు రావడం , తద్వారా గుంటలు ఏర్పడటం జరుగుతుంది. అయితే ఈ పరిస్థితిని నుంచీ నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి, ముఖంపై మొటిమలు, గుంటలు ఏర్పడకుండా ఉండటానికి సహజసిద్దమైన ఫేస్ ప్యాక్ ఎంతో దోహద పడుతుంది.

 Image result for tomato pasupu

శరీర చర్మాన్ని ఆరోగ్యకరంగా చేయడంలో పసుపు, టమోటా లు కీలక పాత్ర పోషిస్తాయి. టమోటాలో విటమిన్ సి , ఆంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన చర్మంపై కాలుష్యం వల్ల పేరుకుపోయిన మలినాలని సమూలంగా తొలగిస్తుంది. టమోటాలో ఉండే బ్లీచింగ్ లక్షణం చర్మంపై నలుపుని తొలగిస్తుంది. ఈ క్రమంలో చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే. టమోటా, పసుపుతో కలిపిన పేస్ ప్యాక్ పెట్టుకుంటే సత్ఫలితాలని పొందవచ్చు. దీనికి కావాల్సింది.

 Image result for tomato pasupu

టమోటాను సగానికి కోసి  దాన్ని స్వచ్చమైన పసుపులో అద్ది ముఖంపై రుద్దుకోవాలి. టమోటా రసం కూడా పిండుతూ బాగా రుద్దుతూ ఉండాలి. ఇలా సుమారు 10 నిమిషాల పాటు మసాజ్ చేసిన తరువాత అరగంట పాటు ఉంచి ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయటం వలన చర్మంలోని మృత కణాలు, మురికి అన్నీ తొలిగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: