వయస్సు పెరిగే కొద్ది చర్మ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ముఖం మీద ముడతలు, మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. దీంతో చాలామంది అద్దం ముందు నుంచొని ఆవేదనకు గురవ్వుతారు. క్రీములు, సోపులు మారుస్తూ.. రకరకాలప్రయోగాలు చేసి చేసి విసిగిపోతుంటారు. ఈ మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, వీటి గురించి మీరు పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. ఈ చిట్కాలతో చాలా తక్కువ సమయంలో ఈ నల్ల మచ్చలను మాయం చేసుకోవచ్చు. మ‌రి ఈ సింపుల్ చిట్కాలేంటో మీరు కూడా చూడండి.


- విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే టమోటా మీ ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే, ముఖంపై ముండే నల్ల మచ్చలను మాయం చేస్తుంది. వారంలో కనీసం రెండు సార్లు టమోటాలో మర్దన చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. 


- గుడ్డులోని పసుపు పచ్చ సొనను పక్కకు తీసేయండి. కేవలం తెలుపును మాత్రమే ముఖానికి రాయండి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే నల్ల మచ్చలనేవే కనిపించవు. 


- పసుపు యాంటీసెప్టిక్ గానే కాకుండా.. సహజ మందులా చర్మసమస్యలతో పోరాడుతుంది. చిటికెడు పసుపు తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి మొటిమలపై రాస్తే సరి. దీనిని తరచుగా రాస్తూ ఉంటే మొటిమలే కాకుండా మచ్చలు కూడా మాయమౌతాయి.


- మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే రోజూ ఈ చిట్కా పాటించవచ్చు. కలబంద మధ్యలో జెల్‌లా ఉండే తాజా జిగురును ముఖానికి రాసుకుని మర్దన చేసి కాసేపు ఆరనివ్వాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా ముఖం మీద మచ్చలు కూడా మాయమవుతాయి. 


- నిమ్మకాయలో కూడా విటమిన్-సి ఉంటుంది. ఇది చర్మం మీద ఉండే నల్ల మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఎక్కడైతే నల్ల మచ్చలు ఉంటాయో అక్కడ నిమ్మకాయ రసం లేదా నిమ్మ బద్దలతో మర్దన చేయాలి. రోజూ ఇలా చేస్తే త్వరగానే ఫలితం కనిపిస్తుంది. 


ఇంకెందుకు ఆల‌స్యం.. మీరు పై చిట్కాలు పాటించి మీ శ‌రీరంపై ఉన్న న‌ల్ల‌మ‌చ్చ‌ల‌కు చెక్ పెట్టేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: