పుదీనా ఆకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీన కాలంనుండి ఎంతోమంది ప్రజలు ఒక ఔషధంగా వాడుతున్నారు. పుదీనాలో అనేక రకాలున్నాయి. ప్రతి రకం పుదీనాకి ఒకో రకమైన మంచి రుచి, వాసనలున్నాయి. మన ఇండ్లలో చేసుకునే అనేక వంటకాలకు రుచి, వాసన, దాని ఔషధ ప్రయోజనాలకు గాను పుదీనాను చేరుస్తాము. పుదీనా ఆకులను వంటకాలలో ప్రధాన సుగంధంగా భారతీయులు, మధ్య ప్రాశ్య‌ దేశాలవారు అధికంగా వాడతారు. 


అలాగే వంటలలో మంచి రుచిని ఇచ్చే పుదీనా వలన అందం కూడా పెరుగుతుంది. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ ఇది చదవండి. ఘాటైన సువాసన కలిగి ఉండే పుదీనా మాయిశ్చరైజర్, క్లీనర్ మరియు లోషన్ రూపంలో కూడా దొరుకుంతుంది. ముఖ్యంగా పుదీనా మరియు దాని సారాన్ని అందాన్ని మెరుగుపరిచే వివిధ రకాల ఉత్పత్తులలో వాడుతున్నారు. 


- పుదీనా నూనెను వాడటం వలన మెరుగైన చర్మం పొందవచ్చు. చర్మంపై ఉన్న నిర్జీవ కణాలను తొలగించి, చర్మం ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది. మెరిసే చర్మాన్నికోసం కొన్ని చుక్కల పుదీనా నూనెను నేరుగా చర్మానికి వాడి తరువాత మార్పులను గమనించండి.


- పుదీనా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మీ జుట్టు కోసం రోజు వాడే నూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనె కూడా వాడి వెంట్రుకలకు అప్లై చేయటం వలన రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదల కూడా బాగుటుంది.


- జిడ్డు చర్మాన్ని కలిగి ఉన్న వారు ఆపిల్ సైడర్ కు కొద్దిగా పుదీనా నూనెను కలిపి చర్మాన్ని అప్లై చేయండి. ఈ మిశ్రమం చర్మం యొక్క pH స్థాయిలను పెంచి, చర్మంలో ఉత్పత్తి చెందే అధిక నూనెలను తగ్గిస్తుంది.


- అలాగే పంటి స‌మ‌స్య‌ల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. పుదీనా ఆకులను పేస్ట్ చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడు శ్వాస నివారించబడుతుంది.


- మీ జుట్టు పొడిగా ఉంటే పుదీనా నూనె మీకు తప్పక సహాయపడుతుంది. దీని కోసం రోజు వాడే కొబ్బరి నూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనెను కలిపి జుట్టుకి అప్లై చేయండి. ఇలా చేయటం వలన వెంట్రుకలకు కావాల్సిన తేమ అందించబడి, జుట్టు యొక్క పొడితత్త్వం తొలగిపోతుంది.


- కొన్ని పుదీనా ఆకులను నలిపి ముఖం మీద మొటిమల ప్రభావిత ప్రాంతానికి రాయండి. కొంతసేపు తరువాత నీటితో కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లో మొటిమలు మరియు మచ్చలు పూర్తిగా మాయమవుతాయి.


- ఎలర్జీలు ఇవి మంచి నివారణ. ఇవి ఎలర్జీ కలిగించే బాక్టీరియాను చంపుతాయి. పుదీనా ఆకులను ముద్ద చేసి ప్రభావిత ప్రాంతానికి రాసుకోవడం ఈ సమస్యకు అత్యుత్తమ పరిష్కారం.


మరింత సమాచారం తెలుసుకోండి: