ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్‌కి త‌గ్గాస్టైల్స్‌ని ఫాలో అవుతూ..ట్రెండీగా ఉండేవాళ్ల‌కోస‌మే ఈ నెయిల్ ఆర్ట్ చూడ్డానికి సింపుల్ గా ఉన్న ఈ ఆర్ట్‌ని అప్లై చేసుకోవ‌డం కూడా చాలా సింపుల్‌. మ‌రింకెందుకు ఆల‌స్యం  ఈ క్రింది విధంగా ఫాలోఅయిపోదాం...


 ముందుగా నెయిల్స్‌క్లీన్ చేసుకుని.. షేప్ చేసోవాలి. త‌ర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్‌ప‌రెంట్ క‌ల‌ర్ వేసుకుని ఆర‌నివ్వాలి. ఇప్పుడు చిత్రంలో ఉన్న క‌ల‌ర్ లేదా మీకు న‌చ్చిన డార్క్ క‌ల‌ర్ నెయిల్‌పాలిష్‌ని అన్ని నెయిల్స్‌కి అప్లై చేసుకుని, అది ఆరిన అనంత‌రం వైట్ క‌ల‌ర్ నెయిల్ పాలిష్‌తో న‌చ్చిన ఆర్ట్‌ను వేసుకోవాలి. ప్ర‌స్తుతం న‌డుస్తున్న న్యూ ట్రెండ్ ఏంటంటే గోళ్ల‌పైన ఘోస్ట్ ఆర్ట్‌లు వేస్తున్నారు.


రంగురంగుల నెయిల్ పాలిష్‌లతో పాటు ఒక నెయిల్ రిమూవర్ ఉంటే చాలు. ఎలాంటి ఆర్ట్‌నైనా మీ చేతుల్లో వేసుకోవచ్చు. కొమ్మలు, రెమ్మలే కాదు ముద్దుగొలిపే మకరందపు మందారపువ్వులను కూడా గోళ్లపై పూయించుకోవచ్చు. చూపరుల నుండి ప్రశంసలు పొందేయెుచ్చు. నిమిషాల్లో నెయిల్ ఆర్ట్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
 
ముందుగా నెయిల్స్ శుభ్రం చేసుకుని షేప్ చేసుకోవాలి. తరువాత నెయిల్స్ అన్నింటికి వైట్‌ కలర్ అప్లై చేసుకోవాలి. తరువాత సన్నని బ్రష్ తీసుకుని లైట్ పింక్ కలర్ లేదా మెచ్చిన కలర్‌తో మందార పువ్వులు రేకులు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త డార్క్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని సన్నని బ్రష్‌తో ఇంతకు ముందు వేసిన లైట్ పింక్ మందార పూలరేకులతో హైలెట్ చేసుకోవాలి.
 
తరువాత గ్రీన్ కలర్ తీసుకుని సింబల్ వేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ తీసుకుని సన్నని బ్రష్‌తో గ్రీన్ కలర్ సింబల్‌కి గీతలు పెట్టుకోవాలి. బ్లాక్ కలర్ లేదా డార్క్ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని ఆకుపచ్చ ఆకు మధ్యలో గీతలు పెట్టుకోవాలి.
తరువాత ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని మందార పువ్వుపైన మూడు చిన్న చిన్న చుక్కలు పెట్టుకుని వాటిపై రెడ్ కలర్ నెయిల్ కలర్ చుక్కలు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని నెయిల్స్‌కి మందార పువ్వులు, ఆకులను డిజైన్ వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: