స‌హ‌జంగా శెన‌గ‌పిండితో అనేక ర‌కాల వంట‌లు త‌యారు చేస్తారు. అయితే ఇది వంట‌ల‌కే కాదు.. చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా చేసే మేలు అంతా ఇంతా కాదు. అందానికి ఎన్నో ర‌కాలుగా శెన‌గ‌పిండి ఉప‌యోగ‌ప‌డుతుంది. సున్ని పిండి, పెసరపిండి, శెనగపిండి ఇవి మన ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి సౌందర్య సాధానాలు. శెనగపిండి చర్మంపై మలినాలను పోగొడుతుంది. ముఖం మీద శెనగపిండి చాలా విరివిగా ఉపయోగిస్తారు. శెనగిపిండితో ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటారు.  శెనగపిండిని ఒక్క చర్మ సంరక్షణలోనే కాదు, కేశ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. శెన‌గ‌పిండితో సౌంద‌ర్య చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..


- శెన‌గ‌పిండిలో కొద్దిగా ప‌సుపు, పెరుగు క‌లిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే ముఖంపై మురికి తొల‌గి కాంతివంతంగా క‌నిపిస్తుంది.


- శెన‌గ‌పిండిలో రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం స్మూత్‌గా, మంచి టోన్‌ను కూడా పొంద‌వ‌చ్చు.


- శెనగపిండిలో బాదం పేస్టు, పాలు, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 30 నిమిషాలు త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గుతాయి.


- శెనగపిండిలో పెరుగు వేసి మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం పెరుకున్న జిడ్డు తొల‌గిపోతుంది.


- శెన‌గ‌పిండిలో అలోవెర జెల్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దీని వ‌ల్ల ముఖం పొడిబార‌కుండా తేమ‌గా ఉంటుంది.


- శెగ‌గ‌పిండిలో కొద్దిగా ప‌సుపు, రోజ్ వాట‌ర్ క‌లిపి ముఖానికి రాసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే మచ్చ‌లు తొల‌గి కాంతివంతంగా క‌నిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: