చర్మం తెల్లగా కాంతివంతంగా మెరవడానికి ఎన్నో రకాల క్రీములు వాడుతూ ఉంటాం.ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని బ్యూటీ పార్లర్ లకి వెళ్తూ ఉంటారు ఎంతో మంది. కానీ ఇంట్లో మనకి లభ్యం అయ్యే పదార్ధాలని ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే అందాన్ని సొంతం చేసుకోవచ్చు. అందుకు మనం ఎక్కడికో వెళ్లి రకరకాల వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఉండే శనగపిండి, పాలపై ఉండే మీగడ చాలు. వీటిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

 Image result for senagapindi milk face pack

శనగపిండి చాలా మంది తినడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. ఇది ముఖంపై పేరుకుపోయిన లోలోపల దాగిఉన్న జిడ్డు, మట్టిని సులభంగా పోగొడుతుంది. అంతేకాదు ముఖం స్వచ్చంగా కాంతివంతగా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పాల మీగడ ఎలా మెరుస్తుందో అలా ముఖంపై మెరుపుని తీసుకువచ్చే గుణాలు అందులో ఉంటాయి. ఈ రెండిటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు పరిశీలిద్దాం.

 Image result for senagapindi milk face pack

ఒక చిన్న గిన్నెలోకి స్వచ్చమైన శనగపిండి తీసుకోవాలి. అందులో కొంచం నీళ్ళు పోసి మెత్తగా ముద్దలా చేసుకోవాలి, అంటే ముఖానికి పట్టేవిధంగా. ఇప్పుడు పాల మీగడని మెత్తగా చేసుకుని ముఖానికి పట్టించాలి (ఒక వేళ శనగపిండి మిశ్రమంలో పాల మీగడ వేసినా పరవాలేదు)  అరగంట పాటు ఆరనిచ్చి ఆ తరువాత  శనగపిండి మిశ్రమాన్ని ముఖంపై అడ్డుకోవాలి. ఒక గంట పాటు బాగా ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇలా వారంలో రెండు సార్లు తప్పకుండా చేస్తే మీ అందం మరింత మెరుగవ్వడం ఖాయం


మరింత సమాచారం తెలుసుకోండి: