విటమిన్ ఇ క్యాప్సుల్స్ వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ ఇ ఆయిల్ చిన్ని చిన్ని కాలిన గాయాలకు చికిత్స చేయటానికి సహాయపడుతుంది. కొద్దిగ  కాటన్ బాల్ మీద ఒక క్యాప్స్యూల్ ఆయిల్ ను వేసి కాలిన గాయాల మీద రాయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. విటమిన్ ఇ ఆయిల్ లో నయం చేసే గుణాలు ఉండటం వల్ల కాలిన గాయాలను నయం చేస్తుంది. కాలిన గాయాలు లేదా మొటిమల వల్ల కలిగే మచ్చలను తొలగించడానికి కూడా ఇది చాలా సహాయం చేస్తుంది.

మచ్చలపై కొన్ని చుక్కల విటమిన్ ఆయిల్ ను వేసి సున్నితంగా మసాజ్ చేయాలి. విటమిన్ ఇ ఆయిల్ చర్మ కాన్సర్ ని సమర్ధవంతంగా నివారిస్తుంది. ఎండలోకి వెళ్లే ముందు నాలుగు నుంచి ఐదు చుక్కల విటమిన్ ఇ ఆయిల్ ని చర్మానికి రాసుకోవాలి. విటమిన్ ఇ లో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లు కేన్సర్ కణాలకు మరియు సూరిని హానికరమైన ప్రభావాలుకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా పని చేస్తుంది. తామర మరియు సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు విటమిన్ ఇ ఆయిల్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.


చర్మ సమస్య ఉన్న ప్రదేశంలో విటమిన్ ఇ ఆయిల్ ని రోజులో రెండు సార్లు రాయాలి. మీ ఆహారంలో విటమిన్ ఇ ఆయిల్ చేర్చితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ చేరడం వల్ల గుండె రక్తాన్ని సరఫరా చేయటం కొంచెం కష్టమవుతుంది. ఆ చెడు కొలెస్ట్రాల్ ని విటమిన్ ఇ సమర్ధవంతంగా తొలగిస్తుంది . విటమిన్ ఇ క్యాప్సూల్స్ ని మనం ఎంత వరకు వాడాలో కూడా మనకి తెలియాలి. అతిగా వాడటం వల్ల చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: