మనుషులు అందంగా ఉండాలని తెగ ఆరాటపడుతుంటారు. కేవలం ముఖం మాత్రమే అందంగా ఉంటె సరిపోదు జుట్టు కూడా అందంగా ఉండాలి. పెరుగుతున్న కాలుష్యాలకు జుట్టు సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. దాని వల్ల జుట్టు ఊడిపోవడం వంటిది ఎక్కువగా చూస్తూంటాము. ఇక ఉరుకుల పరుగులతో క్లినిక్ ల వెంటనో, పార్లర్ వెంటనే తిరుగుతుంటారు. వృధా ప్రయాస తప్ప అక్కడ ఒరిగేదేమి లేదు. కానీ ఏదైనా జరుగుతుందేమో అని బయపడుతూ ఉంటారు. 

అలాంటి వారు ఎన్నెన్నో చేస్తారు గాని ఇంట్లో దొరికే వాటితో మాత్రం ఏది చేయరు. బద్ధకం పెరిగిన మనవాళ్ళు కెమికల్ ఉన్న పర్లేదు ఈజీగా అయిపోవాలని వాటినే ఎక్కువగా వాడుతుంటారు. వంటింట్లో దొరికే ఆలివ్ ఆయిల్ జుట్టును ఎంతో సంరక్షిస్తుంది. ఆ ఆయిల్ తో మనం జుట్టును ఎలా కాపాడుకోచ్ఛునో ఎప్పుడు చూద్దాము. 

ఈ ఆయిల్ లి విటమిన్ ఇ తో పాటుగా యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ నూనెను తలకు పట్టిస్తే చర్మం మృదువుగా మారుతుంది దానితో చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి. 
ఎండవేడిమి కారణంగా ఆగిపోయిన మెలనిన్‌ వర్ణద్రవ్యం తిరిగి ఉత్పత్తి అయి కురులు నల్లగా మారడానికి కూడా ఆలివ్‌ నూనె బాగా ఉపయోగపడుతుంది. తలలో వచ్చే దురదలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. 

ఈ ఆలివ్ నూనెకు కొంచం అల్లం రసం కలిపి నుదురు వరకు పట్టించి గంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు దృడంగా మారుతుంది. 
ఇకపోతే ఆ నూనెను కాస్త వేడి చేసి కొద్దిసేపయ్యాక ఆ నూనెను తల మొత్తానికి పట్టించి ఒక పదిహేను నిమిషాలయ్యాక తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్యలు పూర్తిగా దూరమవుతాయని అంటున్నారు. 

ఇంకా పెరుగులో కొద్దిగా ఈ ఆయిల్ వేసి కలిపి రాసుకున్న కూడా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఆలివ్ ఆయిల్ ని వాడుకోండి.. మీ జుట్టును మీరే కాపాడుకోండి..  



మరింత సమాచారం తెలుసుకోండి: