టూత్‌పేస్ట్‌ కేవలం పళ్లను శుభ్రం చేయడానికే కాదు ఇంకా ఎన్నో రకాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. టూత్‌పేస్ట్‌ను చ‌ర్మ సౌంద‌ర్యంలో గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. అయితే ముఖానికి రాసే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, కళ్ల కింద నల్లని వలయాలను తొలగించేందుకు టూత్‌పేస్ట్‌ ఉపయోగపడుతుంది. ఇందుకు తెల్లటి టూత్‌పేస్ట్‌ మాత్రమే వాడాలి. ఇందులో ఫ్లోరైడ్‌ తక్కువగా ఉంటుంది.


అందువల్ల చర్మానికి ఎటువంటి హానీ కలగదు. మ‌రియు తక్కువ ఫ్లోరైడ్‌ శాతం ఉన్న టూత్‌పేస్ట్‌ని మాత్రమే వాడాలి. మీకు గతంలో ఏమైనా అలర్జీలు ఉన్నట్లయితే టూత్‌పేస్ట్‌ను కొంచెం చేతికి రాసుకుని, 5 నిమిషాలు అలా వదిలేయండి. మంట, దురద, అలర్జీలు ఏమైనా వస్తే ఉపయోగించొద్దు.


- ఒక గిన్నెలోకి కొంచెం టూత్‌పేస్ట్‌, ఉప్పు మ‌రియు నీరు పోసి మిక్స్ చేసి రాసే ముందు ముఖానికి ఆవిరిపట్టండి. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. కొన్ని నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


- ముడతలు, మచ్చలను తొలగించి, చర్మాన్ని బిగుతుగా చేయడంలో టూత్‌పేస్ట్‌ బాగా పనిచేస్తుంది. రాత్రిపూట ముడతలు ఉన్న ప్రదేశంలో కొద్దిగా టూత్‌పేస్ట్‌ రాసి వదిలేయాలి. ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.


- ఎండ వల్ల చర్మం కందితే కాస్త నిమ్మరసాన్ని టూత్‌పేస్ట్‌లో కలిపి రాయండి. చర్మంగా తాజా మారడమే కాకుండా, కాంతివంతంగా కనిపిస్తుంది.


- ఒక గిన్నెలోకి కొంచెం టూత్‌పేస్ట్‌ తీసుకోవాలి. అందులో తేనె వేసి మిక్స్ చేసి ముఖానికి రాసి వదిలేయాలి. పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మొటిమల సమస్యే ఉండదు.



మరింత సమాచారం తెలుసుకోండి: