కళ్ళ కింద నల్ల వలయాలు.. ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరైన నిద్ర లేకనో, ఆరోగ్య సమస్యలనో, ఒత్తిడి వల్లనో 70 శాతం మందికి నల్లటి వలయాలు ఏర్పడుతాయి. అయితే ఆ నల్లటి వలయాలు పోవాలని ఎలా ప్రయత్నించినా పోవు. అలాంటి సమయంలో ఈ చిట్కాలను ఉపయోగిస్తే నల్లటి వలయాలు ఇట్టే తగ్గిపోతాయి. అవి ఏంటో ఒకసారి చదవండి. 


కీర దోసకాయ కళ్ల కింద నల్ల వలయాలను మాయం చేయడంలో బాగా పనిచేస్తుంది. కీర దోసకాయ ముక్కలను ఫ్రిజ్‌లో 30 నిమిషాలు ఉంచి ఆతర్వాత వాటిని కళ్లపై పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత వాటిని తీసి చల్లని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల నల్లటి వలయాలు యిట్టె తగ్గిపోతాయి. 


పచ్చి బంగాళా దుంపతో జ్యూస్‌ చేసి ఆ జ్యూస్‌లో దూది ముంచి కళ్లు మూసుకుని నల్ల వలయాలపై ఆ దూదిని పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వాటిని తొలగించి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.


గ్రీన్ టీ బ్యాగ్‌లను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి అవి చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకోండి. రోజూ ఇలా చేస్తే కళ్ల కింద నల్ల వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. 


కొన్ని గ్లిసరిన్ చుక్కల్లో ఆరెంజ్ రసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌కు రాయండి. ఇలా చేయడం వల్ల నల్ల వలయాలే కాదు, కళ్లు కూడా కాంతివంతంగా కనిపిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: