బేకింగ్ సోడా లేదా వంట సోడా అని కూడా పిలుస్తారు. సాధార‌ణంగా వంట సోడాని మనం కేకులు, బజ్జీలు వగైరాలు గుల్లబారి మృదువుగా వస్తాయని ఉపయోగిస్తాము. అయితే ఇది కేవ‌లం వంట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితిం కాదు. బేకింగ్ సోడాతో ఎన్నో లాభాలు ఉన్నాయి. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా..


- పొట్టలో మంట లేక అస్వస్థతగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. అయితే దీన్ని త‌ర‌చూ వాడ‌కూడ‌దు.


- మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి. తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన, రుచికరంగా ఉంటుంది.


- చెమటతో శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడాను చెల్లితే శరీర దుర్వాసన మాయం చేస్తుంది.


- కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్ లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి పోతుంది .


- బేకింగ్ సోడాలో వాట‌ర్ క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని క‌మిలిన చ‌ర్మంపై స్లో రుద్దాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


- కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే శుభ్రపడుతుంది.


- కూరగాయలు లేక పళ్ళ మీద ఉన్న పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే స‌రిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: