శరీరానికి ఎన్నో పోషకాలు అందించే పండుగా బొప్పాయికి మంచి పేరు ఉంది. అయితే ఈ పండు వల్ల ఎన్నో సౌందర్య లాభాలు ఉన్నాయి. మెరిసే చర్మం, ఆరోగ్యవంతమైన జుట్టు కోరుకునే వారికీ బొప్పాయి వరం అనే చెప్పాలి. సౌందర్య పోషణకు ఈ బొప్పాయి పండు మరి ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ పండు వల్ల ఎం ఎం లాభాలు ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


తరచూ బొప్పాయి గుజ్జు ముఖం, మెడకు రాసుకొంటే అందులోని విటమిన్ 'ఏ' వల్ల చర్మంపై ఉండే మృతకణాలను తొలిగిపోయి చర్మానికి మెరుపు వస్తుంది.


వెన్న, బొప్పాయి గుజ్జు కలిపి కళ్ల చుట్టూ రాసుకొని ఆరనిచ్చి కడిగితే కంటికింది నల్లటి మచ్చలు, వలయాలు నెమ్మదిగా తొలిగిపోతాయి.


బొప్పాయి గుజ్జు తేనె కలిపిన మాస్క్ వాడేవారికి ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది. 


గాయాలు, మొటిమలు, పొక్కుల మూలంగా ఏర్పడిన మచ్చలున్న వారు పచ్చి బొప్పాయి గుజ్జును రాస్తే ఆ మచ్చలు మాటు మాయమవుతాయి.


అరికాళ్ళ, మడమల పగుళ్లకు బొప్పాయి గుజ్జు మంచి ఔషధంగా పనిచేస్తుంది.


వారంలో కనీసం 3 రోజులు బొప్పాయి తినే వారికి జుట్టు రాలే సమస్య అసలు ఉండదు.


3 టీ స్పూన్ల బొప్పాయి గుజ్జు, అరటి పండు గుజ్జు, పెరుగు కలిపి అందులో చెంచా కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి టవల్ చుట్టి గంట ఆగిన తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు మెరిసిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: