అందంగా ఆరోగ్యంగా ఉండలని అందరూ అనుకొంటారు. కానీ 30 ఏళ్ళు వచ్చేసరికి అందరి చర్మానికి ముడతలు పడటం మొదలవుతాయి. దీంతో క్రమంగా కాంతిని కోల్పోవటం మొదలవుతుంది. కానీ కొంతమంది ఎన్ని ఏళ్ళు వచ్చిన అందంగా కనిపిస్తారు. అందంగా ఉంటారు, ఆరోగ్యంగాను ఉంటారు.  అయితే నడివయసులోను.. మెరిసిపోవాలంటే ఈ సౌందర్య చిట్కాలు పాటించండి. అప్పుడు అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. మెరిసే కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు. 


రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. అప్పుడే డీహైడ్రేట్ అవ్వకుండ, అలసట కూడా దూరమై వయసుపై ప్రభావం కనిపించదు.


రోజూ ఓ గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 


తినే ఆహారంలో కార్బోహైడ్రేడ్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆసిడ్లు వంటివి అన్ని అందుతున్నాయా లేదా అనే చూసుకోవాలి. 


రోజు తీసుకునే ఆహారంలో మాంసం, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.  


రోజూ కనీసం అరగంట పాటైనా శరీరానికి ఎండ తగిలితే అవసరమైనంత విటమిన్ డి లభించి చర్మం ముడుతలు పడదు. చర్మ క్యాన్సర్ల ముప్పు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. 


రోజూకు కనీసం 8 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా, అందగా ఉంటారు. 


ప్రతిరోజు నడక, ఇంటి పని, తోట పని, ఆటల కోసం రోజుకు గంట పాటైనా చేస్తే ఎప్పటికి యవ్వనంగాను, ఆరోగ్యంగాను ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: