మొటిమలు.. అమ్మాయిలను తెగ ఇబ్బంది పెడుతుంటాయి. టీనేజ్ వచ్చిందంటే చాలు మేము వస్తున్నాం అంటూ మొటిమలు వస్తాయి. టీనేజ్ లో వచ్చిన మొటిమలు వయసు వచ్చిన కూడా లనే వస్తుంటాయి. ఇలా మొటిమలు రావడానికి ఎన్ని కారణాలు ఉంటాయి.  వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, పొల్యూషన్ ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. 


అయితే ఈ మొటిమలు మాయం అవ్వడానికి ఎన్నో క్రిములు, మరెన్నో సబ్బులు ఉపయోగిస్తారు. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే అలాంటి వారు ఇంటి వద్ద ఉన్న కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి మొటిమల సమస్యను వదిలించుకోండి. ఆ సాహజసిద్దమైన చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


పసుపు, తేనె, పాల ప్యాక్.. 


చెంచా పసుపు, తేనె, పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని ముఖంపై రాయాలి. కాస్తా ఆరాక నీటిని స్ప్రే చేసి మెల్లగా రుద్దుతూ చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల సమస్య చాలావరకూ తగ్గిపోతుంది. 


పెరుగు, బియ్యపు పిండి ప్యాక్..


బియ్యంపిండి లేదా శనగపిండిలో చిటికెడు పసుపు వేసి పేస్ట్ గా తాయారు చేసి దీన్ని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి, ఇలా చేయడం వల్ల మొటిమలు బాగా తగ్గుతాయి.


వేప ప్యాక్..


వేప పొడి లేదా వేప ఆకులని నూరి రసం తీసి అందులో కొద్దిగా శనగపిండి, పసుపు కలిపి మోకునికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో మొఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా చెయ్యడం ద్వారా మొటిమలు త్వరగా తగ్గుమొకం పడుతాయి. 


చందనం ఫేస్ ప్యాక్..


చందనంలో పెరుగు, చిటికెడు పసుపు కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఈ చందనం ప్యాక్ ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మొటిమల సమస్య, చర్మ సమస్య చాలా వరకూ అదుపులోకి వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: