సాధార‌ణంగా అందమైన,ఆరోగ్యమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.  ర‌క ర‌కాల క్రీములు రాస్తూ, ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటూ ​ మెరుపులు అద్దుతుంటారు. బయట ప్రపంచంలో దుమ్ము, కాలుష్యం బాగా పెరిగిపోయింది. దానివలన మొహంపై మొటిమలు, నల్లమచ్చలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కనిపిస్తుంది. ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల చర్మం కాంతిని కోల్పోవడం, మొటిమలు రావడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం జరుగుతుంది. 


అయితే అందంగా.. య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే ఖ‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అందుకు ఆహార మార్పుల‌తో పాటు వ్యాయామాలు కూడా చాలా అవ‌స‌రం. అలాగే కంటి నిండా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం, చర్మం కాంతి విహీనంగా ఉండటం తగ్గిపోతుంది. యాపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లు తీసుకోవాడం వ‌ల్ల వీటిలో ఉంటే అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌‌ చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌‌ను తొలగిస్తాయి.


సౌందర్యంలో ఎ, సి, ఇ విటమిన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. పాల ఉత్పత్తుల్లోనూ, నట్స్‌లోనూ విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. అలాగే ముఖ్యంగా 8 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా అందాన్ని కాపాడుకోవచ్చు. నీటితో పాటు ఫ్రెష్ జ్యూస్‌లు కూడా మీ అందాన్ని మరింత పెంచుతాయి. మీ అందాన్ని మీ ఆలోచనా విధానం కూడా ప్రభావితం చేస్తుందట, కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురవ్వకుండా, నవ్వుతూ జీవించడం ద్వారా మీరు మరింత యవ్వనంగా కనిపిస్తామట.


మరింత సమాచారం తెలుసుకోండి: