చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మేకప్ వేసుకోవడం వల్ల మనం చాలా అందంగా కనిపించవచ్చు. కానీ దానికోసం మనం ఉపయోగించే ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇక ముఖంపై నల్లటి మచ్చలు అయితే చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. 


వీటి కోసం చాలా ఖర్చుపెట్టి పార్లర్‌లకు వెళ్లి ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు. అలాగే పార్టీలు, ఫంక్షన్స్‌లో అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగడమే కాదు.. ఇంట్లోని కొన్ని వస్తువులను కూడా ఉపయోగించి అందంగా తయారవ్వొచ్చు.


- నిమ్మరసంలో ఉన్న ఆస్కోర్బిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృత‌ కణాలను, ట్యాన్‌ను తొలిగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీని కోసం నిమ్మ‌కాయ తీసుకొని, కాట్ చేసి ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


- వంటింట్లో వాడే ఆముదం, ఆలివ్, కొబ్బరి, నువ్వుల నూనెలు చర్మంలోని వ్యర్ధాలను వెలికి తీసే గుణం ఉంది.  రోజుకో నూనెతో చర్మాన్ని సున్నితంగా మర్దన చేసుకుంటే  పొడిబారిన చర్మానికి అవసరమైన తేమ అందటమేగాక కాంతివంతంగా మెరుసిపోతుంది.


- ఒక బౌల్‌లో  శెనగపిండి, పాలపొడి మ‌రియు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకొని కొంత స‌మ‌యం త‌ర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీంతో చ‌ర్మం మెరిసిపోతుంది.


- కమలాఫలం రసంలో పసుపు పొడి కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం ప్యాక్‌ను తొలిగించుకొంటే.. చర్మానికి పోషణను ఇచ్చి అందంగా మెరిసిపోయేలా చేస్తుంది. 


- అరటి పండు పేస్ట్ చేసుకొని అందులో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించుకోవాలి. దీని వ‌ల్ల‌ చర్మం అందంగా.. కాంతివంతంగా మెరుస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: