చర్మ సంరక్షణకు చాలా మంది రక రకాల ఫేస్ ప్యాక్‌లు వాడుతుంటారు. క్రీములు రాస్తుంటారు. బాహ్య సౌదర్యం కన్నా అంతర్ సౌదర్యం గొప్ప అనే మాట నిజమే. ఎందుకంటే చర్మ సౌదర్యం నిగారింపు కోసం సహజ సిద్ధమైనా సాధనాలకు భిన్నంగా అనేక రకాల క్రీములను వాడేవారిని  పలు రకాల బాధలు  పట్టి పీడిస్తుంటాయి.  కొంద‌రు ఏ చర్మానికి ఏ క్రీములు వాడాలో తెలియక ఏదో ఒక క్రీము తీసుకుని వాడటం వల్ల పూర్తిగా నష్టపోతున్నారు. వాస్త‌వానికి క్రీములలో హైడ్రోక్వినాన్ అనబడే రసాయనం ఉంటుంది.


ఈ రసాయనం వలన శరీర చర్మంలో మార్పులు సంభవిస్తుంది. ఇది హానికరమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఫేస్ క్రీములకు దూరంగా ఉంటే మేలంటున్నారు పరిశోధకులు. వాటివల్ల తీవ్రమైనా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. మూడు వేల మంది చర్మ రోగులలో దాదాపు 15 శాతం మంది స్టెరాయిడ్‌తో తయారైన క్రీములను వాడుతున్నట్లు బయటపడింది. అయితే వాటిని వాడుతున్న 90 శాతం మందిలో ఆ క్రీముల తాలూకు దుష్ప్రభావాలు  స్పష్టంగా కనిపించింది.


అలాగే వీటివల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్  ఉధృతం కావడంతో ఫంగల్  చికిత్చ తీసుకునే మందులు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే మార్కెట్‌లో దొరికే ర‌క ర‌కాల క్రీములు, ఫేస్‌ప్యాక్‌ల‌ను వాడే బ‌దులు మ‌న‌కు అందుబాటులో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ముఖం, చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా చేసుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: