చర్మం విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు. అయితే సాధార‌ణంగా చాలా మంది సన్‌ట్యాన్‌ వల్ల ఇబ్బంది పడతారు. సన్‌ట్యాన్ వల్ల చర్మం కమిలిపోవడంలాంటి సమస్య ఎదురవుతుంటుంది.  దీన్నుంచి బయటపడాలంటే సహజసిద్ధమైన బ్లీచింగ్‌ ఏజెంట్స్‌ వాడాలి. అయితే ఇంట్లో దొరికే వస్తువులతో సమస్యను నివారించుకోవచ్చు. అది ఎలాగో ఓ లుక్కేసేయంది. 


- సన్‌ట్యాన్‌ను నివారించడంలో కూడా కొబ్బరి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. ముల్తాని మట్టి, కొబ్బరినీళ్లను కలిపి చర్మంపై ట్యాన్‌ ఉన్న ప్రాంతంలో ప్యాక్‌ వేసుకున్నట్లయితే, ట్యాన్‌ తొలగిపోవటమే కాకుండా నల్ల మచ్చలను కూడా నివారిస్తుంది.


- పెరుగు, గంధం పొడి, టొమాటో రసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ చర్మాన్ని శుభ్రం చేయటంతోపాటు మంచి మెరుపునిస్తుంది.


- పాలు వేడిచేసి దాంట్లో కొద్దిగా నిమ్మరసం, చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత‌ చల్లని నీటితో శుభ్రం చేసి.. మాయిశ్చరైజర్ రాయాలి. దీంతో స‌న్‌ట్యాన్ తొల‌గిపోతుంది.


- బంగాళాదుంపను తురిమి ముఖమంతా పరిచి అరగంట తర్వాత చన్నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే సన్‌ట్యాన్‌ను సులువుగా అరికట్టవచ్చు.


- పెరుగులో కొద్దిగా తేనె మ‌రియు నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి ముఖానికి బాగా అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే స‌న్‌ట్యాన్ నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: