అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఎప్పుడు అందంగా చర్మ కాంతితో వత్తయిన జుట్టుతో మెరిసి పోవాలని అందరికి ఉంటుంది. కానీ ఆలా మెరవడం అందరికి సాధ్యం కాదు.కొంతమంది బ్యూటీ క్రీమ్స్, బ్యూటీ కెమికల్స్ వాడుతారు కానీ ఫలితం ఉండదు. కారణం ఏమైనప్పటికి అందం కోసం కొన్ని చిట్కాలు తప్పక పాటించాలి. ఎంత అందంగా ఉన్న ఈ చిట్కాలను పాటిస్తే మరింత ఆరోగ్యమైన చర్మమంతో మెరిసిపోతారు. అది ఎలానో ఇక్కడ చదివి తెలుసుకొండి. 


కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు, నల్లమచ్చలు తగ్గి ముఖం తాజాగా మారిపోతుంది.


చర్మానికి కొబ్బరినూనె రాసుకొని 30 నిమిషాల తరువాత స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.


కీరదోస రసంలో కొంచెం నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో అలసట తగ్గి తాజాగా మారుతుంది.


పాలు, శనగపిండి, పసుపు పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో మొటిమలు, మచ్చలు తగ్గి మొఖం అందంగా తయారవుతుంది. 


బియ్యపిండి, తేన కలిపి మొఖానికి రుద్దుకోవడం వల్ల స్క్రబ్ లా ఉపయోగపడి మొకంలోని డెస్ట్ అంత పోయి ముఖం మంచిగా తయారవుతుంది. 


ఐస్ క్యూబ్స్ లో నీళ్లు పోసి ఆ బౌల్ లో 10 సెకన్లు చొప్పున రెండు మూడుసార్లు పెడితే ముఖంపై మొటిమలు క్రమంగా తగ్గుతాయి. 


అరటిపండు గుజ్జులో 1 చెంచా గంధం, ½ చెంచా తేనెను వేసి కలిపి మొఖానికి పట్టించి 25 నిముషాలు తర్వాత తీసేయాలి. ఇలా చెయ్యడం ద్వారా ముఖంలో జిడ్డు పోయి ఫ్రెష్ గా కనిపిస్తారు. 


వేరుశనగ నూనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించుకొని 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: