ఆముదం, ఆముదం నూనె గురించి అంద‌రికీ తెలుసు. భారతదేశంలో ఆముదం వినియోగం క్రీ.పూ. 2000 నుంచి ఉంది. వీటిలో తెలుపు, ఎరుపు, పెద్దాముదం అనే మూడు జాతులుంటాయి. ఆముదం నూనెను ప్రాచీన కాలం నుండి వివిధ రకాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టారియల్, యాంటా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఆముదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. అందేకు ఈ నూనె అన్ని రకాల జుట్టు సమస్యలను గ్రేట్ గా నివారిస్తుంది.


చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చివరల్లు చిట్లడం మరియు బట్టతల ను కూడా నివారించడంలో ఆముదం గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే ఆముదం కేవలం జ‌ట్టుకు మాత్ర‌మే కాదు.. సౌంద‌ర్య పోష‌ణ‌లోనూ చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. కనుబొమ్మలు పలుచగా ఉన్న వారు ఆముదాన్ని ఉపయోగించటం వల్ల అందమైన ఒత్తు, వెంట్రుకలను పొందుతారు. ముఖంపై నల్లమచ్చలు మటుమాయం కావాలంటే, కొద్దిగా ఆముదం నూనె తీసుకొని మచ్చలున్నచోట మృదువుగా మర్దన చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


ముఖానికి ఆముదాన్ని రాసుకుని, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీంతో, మృతకణాల్ని తొలగిపోవడమే కాకుండా చర్మాన్ని తాజాగా మారుస్తుంది. అలాగే పొడిబారిన పెదాలకు ఆముదాన్ని రాస్తే, అవి మృదువుగా మారుతాయి. రాత్రిపూట పడుకోవడానికి ముందు ముఖం శుభ్రంగా కడుక్కుని ఏదైనా నూనెలో కొద్దిగా ఆముదం కలిసి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంగా కాంతివంత‌గా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: