చలికాలం వచ్చింది అంటే చాలు.. శరీరానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మాములుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటాము.. కాకపోతే ఈ చలికాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సాధారణంగానే చలికాలంలో ఎక్కువగా పొడిబారి పగుళ్ళు, చారికలు ఏర్పడుతాయి. అయితే అందులో ఎక్కువగా ప్రబావితమయ్యేది పదాలే. ఈ కాలి పగుళ్ళను నిర్లక్ష్యం చేస్తే వీటి నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


పాదాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 


ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి కొద్దిసేపటి తర్వాత చన్నీటితో కడిగి మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే పాదాల మీది మృతకణాలు పోయి మృదువుగా మారతాయి.


రోజ్ వాటర్, గ్లిజరిన్‌ కలిపి పాదాలకు రాసి మసాజ్ చేస్తే మంచిది. 


రోజూ స్నానం చేసేటపుడు పాదాలను ప్యూమిన్ రాయితో రుద్ది ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె రాసినా పదాలు పగలవు.


మెత్తని నూలు సాక్సులు వాడితే చలికాలంలో చాలామంచిది. అయితే ఈ సాక్సులను ఎప్పటికప్పుడు ఉతికితే మంచిద లేదంటే దుమ్ము, మురికి చేరి పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. 


చూశారుగా.. చలికాలంలో పాదాలను ఎలా కాపాడుకోవాలి అనేది. ఈ చిట్కాలను పాటించి మీ పాదాలను జాగ్రత్తగా కాపాడుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: