మానవుని జీవితాలకు పసుపు ఎన్నోవిధాల రక్షణనిస్తుంది. నిత్యం ఇంట్లో వంటల్లో ముఖ్య‌మైనది ప‌సుపు. ప‌సుపు లేకుండా వంట‌లు చేయ‌డానికి చాలా మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌రు. ఈ పసుపు వాడకం అనాదిగా ప్రాచీన కా లం నుంచి వస్తుంది. పసుపుని గుమ్మాలకు పెట్టడంవల్ల ఇళ్లలోకి పాములు, విషపురుగులు, క్రీమి కీటకాలు మన దరికి చేర‌వు. అయితే  ప‌సుపు వంట‌లే కాదు ఆరోగ్యానికి మ‌రియు అందాన్ని కాపాడాటానికి కూడా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ముఖ్యంగా పసుపులో యాంటీయాక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్లమేటరీ గుణాలున్నాయి.


యాంటీసెప్టిక్ గుణాలు కలిగిన పసుపు తలపై చర్మాన్ని, వెంట్రుకల మూలాల్ని శుభ్రం చేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని తలపై చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. చుండ్రు నుండి కూడా ర‌క్షిస్తుంది. పసుపును ఎటువంటి చర్మ తత్త్వం ఉన్నవారైనా ఉపయోగించవచ్చు.


కానీ..  సున్నితమైన చర్మం ఉన్నవారు మాత్రం దీనిని ఉపయోగించే ముందు చర్మవైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే జుట్టు హెన్నాను వాడుతున్నట్లయితే, దాంట్లో కొద్దిగా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి రంగు వస్తుంది. అలాగే ప‌చ్చి పాల‌లో ప‌సుపు వేసి త‌ల‌కు ప‌ట్టించారు. కొంత స‌మ‌యం త‌ర్వాత శ్యాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: