అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాకపోతే కొన్ని కొన్ని సార్లు సమయం లేక అందగా రెడీ అవ్వడానికి టైం కుదరదు. కానీ మృదువైన, కాంతివంతమైన చర్మంతో మెరవాలంటే సహజసిద్ధమైన వస్తువులతో ఆరోగ్యవంతమైన ఫేస్ ప్యాక్ వేసుకోండి. అప్పుడే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. అయితే ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


వేప, శెనగపిండి, పెరుగుతో ఫేస్ ప్యాక్‌...


పెరుగు, శెనగపిండి పేస్టులా కలిపి అందులో వేప పొడిని వేసి పేస్టులో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. అంతే ఆరోగ్యవంతమైన మృదువైన చర్మం ఈ ఫేస్ ప్యాక్ ఇస్తుంది. 


బాదం, తేనె, కుంకుమపువ్వు ప్యాక్‌..


నానబెట్టిన బాదంపప్పులను పేస్టులా చేసి కుంకుమపువ్వును, తేనె, నిమ్మరసాల్ని కూడా కలిపి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి. అది ముఖానికి పట్టించి 10-15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. అంతే చర్మంపై ఉన్న మృతుకణాలు తొలిగిపోయి ముఖం ఎంత అందగా తయారవుతుంది.  


అరటిపండు, పెరుగు ప్యాక్‌...


అరిటిపండు గుజ్జును, పెరుగు, తేనె, నిమ్మరసం వేసి చిక్కటి పేస్టులా తయారుచేయాలి. ఈ ప్యాక్‌ను ముఖం మీద, మెడభాగంలో రాసుకోవాలి. 10నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం శుభ్రంగా ఉండడంతో పాటు కాంతివంతంగా కూడా ఉంటుంది. అరటి పండు గుజ్జును రాసుకోవడం వల్ల కూడా చర్మం మెరుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: