చందనం అత్యంత విలువైన కలప. ఇది ఆరోగ్యానికే కాకుండా, అందానికి సైతం చందనం వాడుకలో ఉంది. మన దైనందిన జీవితంలో వివిధ రకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నాము. పొడి చర్మం, మోటిమలు లేదా మచ్చలు, పిగ్మెంటేషన్ మొదలైన కొన్ని సాధారణ సమస్యలు, మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి.


అయితే ఇలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లకు ఎర్ర చంద‌నంతో చెక్ పెట్ట‌వ‌చ్చు. దీనిని పేస్ట్ రూపంలో లేదా పొడి రూపంలో ఉపయోగించవచ్చు.  చందనం శరీరానికి రాసుకోవడం వల్ల వివిధ రుగ్మతల నుంచి మిముక్తి పొందవచ్చు. చందనంలోని యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మవ్యాధులను తగ్గిస్తాయి. చర్మం రంగుని మెరుగుపరచి, కాంతివంతంగా మార్చుతుంది.


- పసుపు, ఎర్ర చందనం పొడి మ‌రియు తేనె తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ముఖం, మెడ, చేతుల‌కు అప్లై చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.


- ఎర్ర చందనం పొడిలో కొద్దిగా నిమ్మ రసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప్యాక్ వేసి కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు తొల‌గుతాయి.


- ఒక టీ స్పూన్ చందనం, పసుపు, నిమ్మరసం కలిపి చర్మంపై దురద, మంట ఉన్న చోట రాసుకుని, అరగంట తరువాత చల్లటి నీటితో కడిగితే ఆ దురద, మంట ఇట్టే మాయమైపోతాయి.


- ఎర్ర చంద‌నం పొడిలో పెరుగు మరియు పాలు కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి బాగా అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.


- ఎర్ర చంద‌నం పొడి, కర్పూరం మ‌రియు రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమలు లేని ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: