అందం.. అందరికి అందంగా ఉండాలి అని ఉంటుంది. అందం కోసం ఎంతో చేస్తారు. కానీ కొందరు ఎన్ని చేసిన అందంగా అవ్వరు. అది ఏ కారణమైన అవ్వచ్చు.. ముందు మనం తీసుకునే ఆహారం మనల్ని అందంగా చేసే విధంగా ఉండాలి. అప్పుడే అందంగా ఉంటారు. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఇచ్చేవి తింటే ఎంతో అందంగా తయారవుతారు. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి... 

 

పాలకూర.. ఐరన్‌కు ఇది మంచి పాలకూర. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు నివారిస్తాయి. రక్తహీనతను దూరం చేసి చర్మానికి రంగునిస్తాయి.

 

ద్రాక్షపండ్లు.. ఈ ద్రాక్ష పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల ఎన్నో రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. వీటిలోని లైకోపిన్‌ చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడి, మృదువుగా మారుస్తుంది.


  
బాదం.. ఈ బాదాం డ్రై ఫ్రూట్‌ చర్మానికి తేమని అందిస్తుంది. వీటిలోని విటమిన్‌ ఇ సూర్యకిరణాల బారి నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.


 
గ్రీన్‌ టీ.. ఈ 'గ్రీన్ టీ'లోని యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోని విషపదార్థాలను బయటకు పంపి చర్మానికి సహజ మెరుపుని అందిస్తాయి.  

 

క్యారట్‌.. క్యారెట్ లోని విటమిన్‌ 'ఎ', యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో పోషణనిస్తాయి. చర్మ ముడతలు, రంగు పేలిపోవడం, మచ్చలు వంటివి ఏర్పడకుండా ఈ క్యారెట్ చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: