ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అందం పట్ల శ్రద్దను పెడుతున్నారు. అయితే కళ్ళు ఎంత అందంగా ఉన్నా..అందమైన కనుబొమ్మలు లేకపోతే ఆ ముఖం ఎంత అలంకరించుకొన్నా, అందవిహీనంగానే కనబడుతుంది. మందంగా.. చూడ్డానికి ఒత్తుగా ఉండే ఐబ్రోస్ ముఖానికి మరింత వన్నె తీసుకొస్తాయి. ఒత్తైన కనుబొమ్మలు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే, అందరికీ అలా ఉండవు. చాలామందికి తక్కువ కనుబొమ్మలు ఉంటాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉన్నవారు చిన్నవారిగా కనిపిస్తారు. 

 

అయితే, అనేక కారణాల వల్ల చాలామందికి కనుబొమ్మలు అంత ఒత్తుగా, దృఢంగా పెరగవు. అలాంటి వారు కంగారు పడకుండా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవచ్చు. బాదం నూనెలో విటమిన్స్ ఉంటాయి. విటిమిన్ ఏ, బి, ఇ ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడేవే. ఈ ఆయిల్‌ని కూడా కనుబొమ్మలపై మసాజ్ చేయడం వల్ల ఐబ్రోస్ బాగా పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు కనుబొమ్మ‌లకు కొబ్బరి నూనె రాసుకోవాలి.  క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పెరుగుతాయి.

 

ఉల్లిపాయ రసం కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. దీని వల్ల హెయిర్ ఫోలిక్స్ బలపడి కొల్లాజెన్ కణజాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కారణంగా ఐబ్రోస్ కూడా బాగా పెరుగుతాయి. పడుకునేముందు పాలల్లో దూదిని ముంచి కనుబొమ్మలపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే గ్రోత్ బాగుంటుంది. సో.. కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకి రెండు పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: