సాధారణంగా వంటింటి ప్రియులు ఎప్పుడు వంటింట్లోనే ఉంటారు. వంటలు చేసుకుంటూ ఉండటమే కొందరి జీవితం అవుతుంది. అయితే అలాంటి వారు వంటల్లో ఎంత అనుభవం ఉన్న సరే ఒకొక్కసారి చేతులు కాలుతుంటాయి.. ఒకొక్కసారి వేడి నీళ్లు పడుతుంటాయి.. మరి కొన్నిసార్లు టైం బాగోలేకపోతే వేడి వేడి నూనె కూడా పడే అవకాశం ఉంటుంది. 

 

అయితే ఆ కాలిన గాయం మానినా మచ్చలు పోవు. ఎన్ని ప్రయత్నించినా సరే ఆ మచ్చలు పోవు. అయితే ఈసారి కాలిన వెంటనే నీళ్ల కింద పెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్న చిట్కాలను ఉపయోగించండి. మంట చిటికెలో మాయమవటంతో పాటు గాయం కూడా త్వరగా మానుతుంది. 

 

ఆ చిట్కాలు ఏంటంటే.. అలోవేరా గుజ్జును కాలిన ప్రదేశంలో రాయాలి. అలోవేరా గుజ్జు చర్మం మీద పొరలా పరుచుకుంటుంది. దాంతో నరాల చివర్లు గాలికి ఎక్స్‌పోజ్‌ అవకపోవటంతో మంట అదుపులోకొస్తుంది. పైగా కలబంద గుజ్జు వల్ల గాయం త్వరగా మానటంతో పాటు, ఆ ప్రదేశంలో మచ్చ ఏర్పడకుండా జాగ్రత్త పడుతుంది. 

 

చూశారుగా.. మచ్చలు లేకుండా చేసే కలబంద గురించి. ఇలాంటి ఎన్నో చిట్కాలను ఉపయోగించి కాలిన గాయాలను మానేలా చేసుకోండి. అలాగే ఈ కలబంద చిట్కా పాటించి కాలిన గాయాన్ని మానేలా చేసుకోండి. అప్పుడే గాయాలు మని చర్మంపై మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. 

                          

                                   

                                           

మరింత సమాచారం తెలుసుకోండి: