సాధారణంగా ప్రతిఒక్కరికి మోచేతులు, మోకాళ్ళు నల్లగా ఉంటాయి. అలాగే బాగా గరుకుగా అనిపిస్తాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ ప్రాంతం తెల్లగా మారదు. వాస్త‌వానికి మనం ముఖం అందంగా కనపడటం పట్ల మాత్రమే శ్రద్ధ చూపిస్తాం, కానీ మోచేతులు, మోకాళ్ళ రంగు పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఎండ, ఒత్తిడి, రాపిడి వల్ల మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. నలుపు రంగులో ఉన్న మోకాళ్లు, మోచేతులు ఎవరికీ కనిపించకుండా దాచుకునేందుకు పలువురు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రదేశాలు కూడా మిగతా శరీరంలో కలిసిపోయేలా తెల్లగా మారాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..

 

-  నిమ్మరసం చర్మానికి తెల్లదనాన్నిస్తుంది. మోకాళ్లు, మోచేతుల మీద నిమ్మరసం అప్లై చేసి గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

 

- బొప్పాయిలో విటమిన్‌ ఎ, సిలతోపాటు చర్మాన్ని శుభ్రపరిచే పెపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. కాబట్టి బొప్పాయి గుజ్జులో పెరుగు కలిపి మోచేతులు, మోకాళ్లకు రుద్దాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఈ ప్రదేశాలు తేల్ల‌గా తయారవుతాయి.

 

- ఒక టేబుల్‌స్పూన్ శనగపిండి తీసుకుని, అందులో పసుపు, పెరుగు సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులకు ఐప్లె చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేస్తే అక్కడి చర్మం వెలుగులీనుతుంది.

 

- ఆలివ్‌ ఆయిల్‌లో పంచదార కలిపి మోచేతులు, మోకాళ్లమీద సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. తర్వాత సబ్బునీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే ఈ ప్రదేశాలు తెల్లగా తయారవుతాయి.

 

- పాలు బ్లీచ్‌లా పనిచేస్తే, తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమిసంహారకం. కాబట్టి ఈ మూడిటిని కలిపి ప్యాక్‌ వేయాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం తేటగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: