పెరటిలో దొరికే ఉసిరికాయతో అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల పలు రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి ‘సి’ విటమిన్‌ నిధి. అందుకే దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వైరల్‌, బాక్టీరియల్‌ జబ్బులు సైతం రాకుండా ఉసిరి నిరోధిస్తుంది. వీటిల్లో అనేక పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరి శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌ గ్లూకోజ్‌ ప్రమాణాలను తగ్గిస్తుంది. ఉసిరి జ్యూసు రోజూ తాగితే మంచిది. 

 

ముఖ్యంగా రక్తపోటు ఎక్కువ ఉన్నప్పుడు ఉసిరి జ్యూసు తాగడం వల్ల వెంటనే నియంత్రణలోకి వస్తుంది.ఉసిరి ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి అంతకంటే ఎక్కువ మేలు చేస్తుంది. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.  మ‌రి ఎలాగో ఓ లుక్కేయండి. ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ, కోడిగుడ్డు తెల్లసొన, బాదంపేస్ట్ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. కొంత స‌మ‌యం  తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు.

 

అలాగే ఉసిరికాయను ముద్దగా నూరి కొద్దిగా పసుపు, నువ్వులనూనెను కలిపి శరీరానికి రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతూ కనిపిస్తుంది. అదే విధంగా, ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కొంత స‌మ‌యం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై ముడుతలు కూడా తొలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: