పసుపు.. ఎంతో అందాన్ని ఇస్తుంది. ఈ పసుపు వల్ల శరీరం ఎంతో అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అంతే కాదు ఏమైనా చర్మ సమస్యలు ఉన్న సరే ఈ పసుపు యిట్టె పొగుడుతుంది. ఈ పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లను పూర్తిగా నివారిస్తాయి. 

 

ఈ పసుపు ఫేస్ ఫ్యాక్‌ తో చుండ్రు, చర్మ పగుళ్లు వంటి సమస్యలను మటుమాయం చేసి తాజా మెరుపును ఇస్తుంది. అయితే ఈ పసుపును ఎలా ఎక్కడ ఉపయోగించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

బాడీ స్క్రబ్‌.. బాదం గింజల పొడి, పెరుగు, కొద్దిగా పసుపు కలిపి ఫేస్‌, బాడీ స్క్రబ్‌గా ఉపయోగించండి. దీని వల్ల మృతకణాలు మెల్లగా తొలిగిపోయి చర్మం తాజాగా, కాంతివంతంగా తయారవుతుంది. 

 

మచ్చలు కూడా మాయం..  ఉండాల్సిన లావు కంటే ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట, నడుము భాగంలో స్ర్టెచ్‌మార్క్స్‌ ఏర్పడుతాయి. అంతేకాదు ఈ స్ర్టెచ్‌మార్క్స్‌ గర్భవతి సమయంలో కూడా ఏర్పడుతాయి. అయితే ఈ స్ర్టెచ్‌మార్క్స్‌ ను తొలగించేందుకు మొదట ఆలివ్‌ ఆయిల్‌తో మర్ధన చేసుకొని తరువాత సెనగపిండి, పసుపు మిశ్రమాన్ని రాసుకొని 30 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల స్ర్టెచ్‌మార్క్స్‌ మెల్లగా తగ్గుముఖం పడుతాయి. 

 

హెయిర్‌ మాస్క్‌... పాలు, పసుపు మిశ్రమాన్ని వెంట్రులకు మాస్క్‌లా వేసుకుంటే దీంతో మాడు భాగంలో దురద, చుండ్రు సమస్య తగ్గు ముఖం పడుతుంది. 

 

బాడీ ప్యాక్‌.. చిటికెడు పుసుపులో కొద్దిగా సెనగపిండి, పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చేతులు, పాదాలకు రాసుకొని ఆరిన తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. 

 

చూశారుగా పసుపుతో ఎన్ని లాభాలో.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే పసుపుతో ఈ ఫ్యాక్ లు వేసేసుకోండి. అందంగా తయారవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: