నేటి సమాజంలో అందంగా కన్పించడానికి ఆరాటపడేవారు ఎక్కువ. మార్కెట్లో రకరకాల కాస్మోటిక్స్‌ వారిని ఆకర్షిస్తుంటాయి. అయితే మేక‌ప్ వేసుకోక‌పోతే అందంగా క‌నిపించ‌లేం అని అనుకుంటారు అమ్మాయిలు. కానీ.. అది త‌ప్పు. స‌హజంగానే యువ‌తులు సౌంద‌ర్య వ‌తులే.. కాక‌పోతే వారు ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోవ‌డంలో కొంత అశ్ర‌ద్ధ చూపడంతో అ ఆందాలు మ‌స‌క‌బార‌తాయి. ఇక మ‌నం శ‌రీరానికి ధ‌రించేవి కొన్న‌యితే రాసుకుని, పూసుకునే క్రీములు కొన్ని, దంతాల‌ను తోముకునే టూత్‌పేస్టులు, కాస్మొటిక్స్ ఇలా చాలా ఉంటాయి. 

 

అయితే పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో త‌యారు కాబ‌డిన వ‌స్తువుల‌ను వాడితే మ‌న‌కు ఎలాంటి ప్ర‌మాదం లేదు. కానీ ఇప్పుడు త‌యారు చేసే వ‌స్తువులు చాలా వ‌రకు అలా ఉండ‌డం లేదు క‌దా. ఈ క్ర‌మంలో నిత్యం మ‌నం వాడుతున్న అలాంటి ప‌లు వ‌స్తువులు మ‌న‌కు క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌కర వ్యాధుల‌ను తెచ్చి పెడుతున్నాయ‌ట‌. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. స‌హ‌జంగా కొంద‌రు మ‌హిళ‌లు లిప్ స్టిక్ లేనిదే ఉండరు. కానీ.. లిప్‌స్టిక్‌ల‌లో తార్ (డాంబ‌ర్‌), పెట్రోలియం డిస్టిలేట్స్‌, ఫార్మాల్డిహైడ్‌, ప్రొపైల్ పారాబెన్‌, పాలీప్రొపిలీన్ వంటి అనేక కెమిక‌ల్స్ ఉంటున్నాయ‌ట‌. ఇవ‌న్నీ మ‌న‌కు క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధుల‌ను తెచ్చి పెడ‌తాయ‌ట‌.

 

అలాగే టాల్కం పౌడ‌ర్‌లో మెగ్నిషియం సిలికేట్‌, ఆస్బెస్టాస్ వంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి అండాశ‌య క్యాన్స‌ర్‌, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయి. నెయిల్ పాలిషుల్లో డీఎండీఎం హైడెన్‌ష‌న్‌, ఇమిడాజోలిడినైల్ యూరియా, ఫార్మాల్డిహైడ్ వంటి కెమికల్స్ ఉండ‌డం వ‌ల్ల‌ క్యాన్స‌ర్‌, అల‌ర్జీలు, ఆస్త‌మా, డిప్రెష‌న్‌, నిద్ర‌లేమి వంటి వ్యాధుల‌ను క‌లిగిస్తాయి. చ‌ర్మం మృదువుగా మారేందుకు ఉప‌యోగించే మాయిశ్చ‌రైజ‌ర్ల‌తో స్కిన్ క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌. సో.. ఇలాంటి అనేక కాస్మోటిక్స్ వాడ‌డం కంటే కొన్ని ప్రత్యేక‌మైన నేచురల్ బ్యూటీ టిప్స్ ను అనుసరించడం ఉత్త‌మం.

మరింత సమాచారం తెలుసుకోండి: