అందంగా ఉండాలని అందరికి ఉంటుంది. మాములు సమయంలో అయితే అందం గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని కొన్ని సమయాలలో అందం చాల ముఖ్యం. ఆ సమయాలు ఏవి అంటే ఎప్పుడైనా స్పెషల్ గా బయటకు వెళ్లేసమయంలోనో, ఫంక్షన్ కి వెళ్లే సమయంలోనో ఇంకెక్కడికైనా వెళ్లే సమయంలోనో అత్యవసరం అందగా ఉండటం. అయితే ఆ సమయంలో ఫెయిరీ టైల్స్ లో బొమ్మల బుగ్గలు ఎర్రగా అందంగా ఉన్నట్టు మన బుగ్గలు ఎర్రబడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే ఆ జాగ్రత్తలు ఆలా ఎర్రబటానికి చెయ్యాలిసిన పద్ధతులు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

నీటితో శుభ్రం చేసుకున్న ముఖానికి ముందుగా ఫౌండేషన్‌ రాసుకోవాలి దానివల్ల స్కిన్‌ టోన్‌ ఒకే రంగులో కనిిపిస్తుంది. అంతేకాదు ఈ ఫౌండేషన్ వల్ల బ్లష్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. తరువాత మెత్తని మేకప్‌ బ్రష్‌తో గులాబీ రంగు మేకప్‌ పౌడర్‌ లేదా మేకప్‌ క్రీమ్‌ను '3' ఆకారంలో రెండు చెక్కిళ్ల మీద రుద్దుకోవాలి. అవసరం అనుకుంటే నుదురు మీద కూడా అప్లై చేసుకోవచ్చు.

 

మీ చర్మతత్వానికి నప్పే బ్లష్‌ ఎంచుకోవాలి. అది క్రీమ్‌ లేదా పౌడర్‌ బ్లష్‌ కావొచ్చు. జిడ్డు చర్మం వారికి పౌడర్‌ బ్లష్‌ సరిపోతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లు క్రీమ్‌ బ్లష్‌ వాడితే ఎక్కువ సమయం నిలవడమే కాదు ఎక్కువ మెరుపునిస్తుంది కూడా. పౌడర్‌ బ్లష్‌ వాడేటప్పుడు కొసలు పలచగా ఉన్న బ్లష్‌ బ్రష్‌ వాడితే రంగు చక్కగా వస్తుంది. 

 

మోకానికి తగ్గ రంగులు ఎంచుకోవాలి.. 

 

ఫెయిర్‌ స్కిన్‌ ఉన్నవారు లేత గులాబీ రంగు ఎంచుకోవాలి. ముదురు రంగు చర్మం వారు బెర్రీ కలర్‌ వాడితే అలంకరణలో కొత్తదనం కనిపిస్తుంది. కొన్నిరకాల బ్లష్‌లు ఎక్కువ సమయం నిలవవు. బుగ్గల మీద చమ్కీలుగా కనిపిస్తూ ఎబ్బెట్టుగా ఉంటుంది. చూశారుగా ఎలాంటి చిట్కాలు పాటిస్తే ఎర్రటి బుగ్గలు మీ సొంతం అవుతాయి అనేది.. ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాలను పాటించి మీ బుగ్గలను ఎర్రగా అందంగా తయారు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: