ఐబ్రోస్.. కంటికి, ముఖానికి అందాన్ని ఇచ్చేవి. ఈ ఐబ్రోస్ వల్ల కంటి అందం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఆ ఐబ్రోస్ వత్తుగా పెరగాలంటే చాలా జాగ్రత్తగా కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు ఏంటి అని అనుకుంటున్నారా ? అవి ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                      

ఆముదం...

                      

రెండు చుక్కల ఆముదానికి ఒక చుక్క లావెండర్‌ ఆయిల్‌ చేర్చి, బాగా కలపాలి. దానిలో మస్కారా బ్రష్‌ను ముంచి, కనురెప్పలకు పూసుకోవాలి. అలాగే రాత్రంతా వదిలేసి, ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ఐబ్రోస్ క్రమంగా పెరగడం మొదలవుతుంది. 

                       

కలబంద...

                      

రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద గుజ్జుకు, జొజొబా ఆయిల్‌, చామొమైల్‌ ఆయిల్‌ ఒక్కొక్క చుక్క చేర్చాలి. బాగా కలిపి, మస్కారా బ్రష్‌తో కనురెప్పలకు అప్లై చేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే కడిగేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయాలి. ఇలా చెయ్యడం వల్ల ఫలితం కనిపిస్తుంది. 

               

నిమ్మ తొక్కు...

       

నిమ్మ తొక్కల్ని ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. టీస్పూను నిమ్మపొడికి, ఒక చుక్క లావెండర్‌ ఆయిల్‌ చేర్చి, బాగా కలపాలి. రాత్రి ఈ మిశ్రమాన్ని బ్రష్‌తో ఐబ్రోస్ కు అప్లై చేసి, ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: