మన రోజువారీ జీవితంలో మనల్ని ఇబ్బందిపెట్టే చర్మసమస్యల్లో కళ్ళ కింద వచ్చే నల్లవలయాలు ఒకటి. అన్ని రకాల వయస్సులు కలిగిన మహిళలందరూ కంటి కింద నల్లటి వలయాలతో ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోయింది. ఇక మహిళలు ఎంత అందంగా ఉన్నా కూడా కంటి కింద నల్లటి వలయాల కారణంగా బయటకు రావడానికి, ఏదైనా ఫంక్షన్ లకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ నల్లవలయాల వలన ఎవరైనా అలసినట్లు, డల్ గా కన్పించవచ్చు. హార్మోన్లలో మార్పులు సంభవించడం, ఆరోగ్యపరమైన సమస్యలు, సమతుల్యమైన ఆహారం అందకపోవడం మొదలైన వంటి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణం కావచ్చు.

 

అయితే వీటికి చెక్ కొన్ని చిట్కాలు ఉప‌యెగిస్తే స‌రిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూను తురిమి ఆ ముక్కలను కళ్లకింద పెట్టి కొద్ది సమయం తర్వాత తీసేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ కళ్ళ కింద వలయాలను వెంటనే తగ్గిస్తుంది. పచ్చి పాలలో దూదిని ఉంచి, ఆ దూదితో కళ్ళ కింద మసాజ్ చేసుకోవడం వల్ల న‌ల్ల‌టి వ‌ల‌యాలు త్వరగా తగ్గిపోతాయి. రోజ్ వాటర్ కూడా కళ్ల కింద వలయాలను తగ్గిస్తుంది. రోజ్ వాట‌ల్ దూదిని ముంచి క‌ళ్ల కింద పెట్టి కొద్ది సమయం తర్వాత తీస్తే స‌రిపోతుంది.

 

మ‌రియు బాదం నూనెలో ఉండే అధిక విటమిన్ ఇ వలన నల్లవలయాలు తొలగిపోతాయి. కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని, కంటిపై ప్రతి రాత్రి పడుకునేముందు అప్లై చేయాలి. ఇలా త‌ర‌చూ చెస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. అలాఏ ఒక స్పూన్ నిమ్మరసం మరియు టమోటో రసాన్ని గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ శనగపిండి కలుపుకుని మిశ్రమంగా చేసుకున్నాక కంటి కింది వలయాలపై రాసుకోవడం వలన ఈ సమస్యకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: