పెదువులు.. ముఖానికి ఎంత అందాన్ని ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత అందాన్ని ఇచ్చే పేదలు ఈ చలికాలంలో పొడిబారి ఇబ్బంది పెడుతాయి. అలాంటి ఈ పేదలు అందంగా ఆరోగ్యంగా కనిపించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                    
 
పెదవుల మీద మృతకణాలు పేరుకోవడం వల్ల పొడిగా కనిపిస్తాయి. అలాంటప్పుడు స్క్రబ్బర్‌తో వాటిని తొలగించుకోవాలి. తేనె, చక్కెర మిశ్రమం సహజ స్క్రబ్బర్‌గా పనికొస్తుంది. ఈ మిశ్రమంతో రుద్దుకుంటే మృతకణాలు తొలగి పెదవులు మృదువుగా, తాజాగా కోమలంగా కనిపిస్తాయి.

                    

పగుళ్లు ఏర్పడిన పెదవుల మీద కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే వాటికి తేమ అందుతుంది. కొబ్బరినూనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పెదవుల పగుళ్ల మీద బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకొని ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.

                    

అలోవెరాలోని జెల్‌ పగిలిన పెదవులకు మందుగా పనిచేస్తుంది. అలోవెరా జెల్‌ను కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, పెదవులకు రాసుకోవాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు ఈ జెల్‌ రాసుకుంటే పేదలు సున్నితంగా, ఆరోగ్యంగా మారతాయి.

 

ఒక చుక్క నెయ్యి పెదవులకు పూసుకుంటే తేమ అందుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు నెయ్యి రాసుకుంటే ఉదయానికి పెదవులు తాజాగా కనిపిస్తాయి.

 

గ్రీన్‌ టీ బ్యాగ్‌లోని యాంటీ ఆక్సిడెంట్‌, మినరల్స్‌, పాలీఫెనాల్స్‌ పెదవులకు రక్షణనిస్తాయి. గ్రీన్‌ టీ బ్యాగును పెదవుల మీద కొద్దిసేపు రుద్దుకుంటే మృతకణాలు మాయమై ఆరోగ్యకరంగా మారుతాయి. 

 

చూశారుగా.. ఈ టిప్స్ పాటించి మీ పేదల కోమలత్వాన్ని రక్షించుకోండి. ఆరోగ్యంగా అందంగా కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: